AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాల్గుడి డేస్ నుంచి కేజీఎఫ్ వరకు.. లెజండరీ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..

భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్రముఖ బహుభాషా నటుడు, కన్నడ సినీ దిగ్గజం అనంత్ నాగ్‌ను వరించింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జీవితకాల సాధనకు ఇచ్చే ఈ గౌరవం ఒక అరుదైన, బహుముఖ ప్రజ్ఞాశాలికి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 22న ఆయన ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

మాల్గుడి డేస్ నుంచి కేజీఎఫ్ వరకు.. లెజండరీ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..
Actor Anant Nag Dadasaheb Phalke Award
Krishna S
|

Updated on: Sep 16, 2026 | 6:20 PM

Share

భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్రముఖ బహుభాషా నటుడు, కన్నడ సినీ దిగ్గజం అనంత్ నాగ్‌ను వరించింది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జీవితకాల సాధనకు ఇచ్చే ఈ గౌరవం ఒక అరుదైన, బహుముఖ ప్రజ్ఞాశాలికి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 22న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

సినీ ప్రస్థానం..

1970వ దశకంలో నాటకరంగం ద్వారా కళా ప్రయాణాన్ని ప్రారంభించిన అనంత్ నాగ్, ఆ తర్వాత ఆర్ట్, కమర్షియల్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించారు. లెజెండరీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ప్రఖ్యాత హిందీ చిత్రం అంకుర్ (1974)తో అనంత్ నాగ్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నిశాంత్, భూమిక, మంథన్, కలియుగ్ వంటి ఎన్నో క్లాసిక్ హిందీ చిత్రాల్లో తన సహజ నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కన్నడలో శంకర్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్ టీవీ సిరీస్‌లో అనంత్ నాగ్ పోషించిన పాత్రలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా అభిమానాన్ని సంపాదించాయి. బయలు దారి, చందనద గొంబె, గౌరి గణేశ, ఉద్భవ వంటి వందలాది చిత్రాల్లో హాస్యం, తీవ్రమైన భావోద్వేగాలు, ప్రతినాయక ఛాయలు ఉన్న విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

పాన్ ఇండియా గుర్తింపు

నేటి తరానికి సైతం కేజీఎఫ్, గాలిపట, సర్కారి హిరియ ప్రాథమిక శాలె వంటి చిత్రాల ద్వారా తన నటన ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చాటిచెప్పారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి బహుభాషా నటుడిగా ఖ్యాతి గడించారు.

రాజకీయాల్లోనూ తనదైన శైలి

అనంత్ నాగ్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. కర్ణాటక శాసన మండలి సభ్యుడిగా, జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తనదైన ముద్ర వేశారు.

ఎంతో ఆనందంగా ఉంది – ప్రధాని మోదీ

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘అద్భుత నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో సంతోషకరం. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన తన సహజసిద్ధమైన నటన, విశేషమైన బహుముఖ ప్రజ్ఞ, అసమాన ప్రతిభతో భారతీయ చిత్రసీమపై, ప్రత్యేకించి కన్నడ సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ అరుదైన లోతును, వాస్తవికతను నింపారు. భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన ఒక గొప్ప కళాకారుడికి దక్కిన ఈ అత్యున్నత గౌరవం పూర్తిగా సమంజసమైనది, సముచితమైనది” అని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Follow Us