AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ.. బ్యాడ్‌లక్ లిస్ట్‌లో టాప్ టీం ఏదంటే?

T20 World Cup 2026: ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అన్ని జట్లు తమ వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అయితే, కొన్ని జట్లకు టోర్నమెంట్‌కు ముందే ఊహించని షాక్ తగిలింది.

ఇదేందయ్యా సామీ.. మెగా ఈవెంట్‌కు ముందే కోలుకోలేని దెబ్బ.. బ్యాడ్‌లక్ లిస్ట్‌లో టాప్ టీం ఏదంటే?
Icc World Cup
Venkata Chari
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 7:29 AM

Share

T20 World Cup 2026: భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీకి ముందే అన్ని జట్లకు గాయాల బెడద మొదలైంది. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. ఈ జాబితాలో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

మొత్తం 20 జట్లు తలపడే ఈ మెగా టోర్నీ మార్చి 8న ముగియనుంది. ఫిబ్రవరి 2 నాటికి అన్ని జట్లు తమ తుది ఆటగాళ్ల జాబితాను ఖరారు చేశాయి. శ్రీలంక చివరగా తమ జట్టును ప్రకటించింది.

గాయపడిన ఆటగాళ్లు, వారి స్థానంలో జట్టులోకి వచ్చిన రీప్లేస్‌మెంట్ ప్లేయర్ల వివరాలు ఓసారి చూద్దాం..

1. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా):

ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం (Back Injury) నుంmr కోలుకోకపోవడంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ బెన్ ద్వార్షుయిస్ జట్టులోకి వచ్చాడు. రాబోయే కీలకమైన టెస్ట్ సీజన్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలనే ఉద్దేశంతోనే వరల్డ్ కప్ చిడి తప్పుకుంటున్నట్లు కమిన్స్ తెలిపారు.

2. ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్):

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. గత నెలలో జరిగిన SA20 లీగ్‌లో బౌలింగ్ చేస్తుండగా ఆయనకు ఈ గాయమైంది. మిల్నే స్థానంలో కైల్ జేమీసన్ కివీస్ జట్టులో చేరాడు.

ఇది కూడా చదవండి: PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?

3. టోనీ డి జోర్జి (దక్షిణాఫ్రికా):

గతేడాది చివర్లో భారత్ పర్యటన సమయంలో కుడి కాలి హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన డి జోర్జి, ఈ వరల్డ్ కప్‌లో ఆడటం లేదు. ఆయన స్థానంలో విధ్వంసకర బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చాడు.

4. డొనోవన్ ఫెరీరా (దక్షిణాఫ్రికా):

ఎస్ఏ20 లీగ్ సందర్భంగా ఫెరీరా ఎడమ కాలర్ బోన్ (Clavicle) ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. దీనివల్ల ఆయన టోర్నీ నుంచి తప్పుకోగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ఆయన స్థానంలో ఎంపికయ్యాడు.

ఇది కూడా చదవండి: Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా ‘ఛోటా ప్యాకెట్’

5. నవీన్-ఉల్-హక్ (అఫ్గానిస్తాన్):

కుడి భుజానికి సర్జరీ అవసరమయ్యే స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా అఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఆయన స్థానంలో మీడియం పేసర్ జియావుర్ రెహమాన్ అఫ్గాన్ జట్టులోకి వచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..