AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా ‘ఛోటా ప్యాకెట్’

T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 మరో మూడు రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ పూర్తి స్వ్కాడ్‌లతో సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో సూర్యసేన సారథ్యంలో భారత జట్టు డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా 'ఛోటా ప్యాకెట్'
Ishan Kishan T20i World Cup
Venkata Chari
|

Updated on: Feb 04, 2026 | 9:04 AM

Share

T20I World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ నకు మరో మూడు రోజులు మిగిలి ఉంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంకలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కంటే డేంజరస్ ప్లేయర్ ఒకరున్నారు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట విలన్ గా మారే ఛాన్స్ ఉంది. ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

అభిషేక్ శర్మ కాదు భయ్యో..

టీ20 క్రికెట్‌ అంటేనే బౌలర్లకు గుండె దడ. ఏ బ్యాటర్ ఏ క్షణంలో ఎలా రెచ్చిపోతాడో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి డేంజరస్ ప్లేయర్ భారత జట్టులో కూడా ఉన్నాడు. దేశవాళీలో రెచ్చిపోయి.. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో డేంజరస్ బ్యాటింగ్ రప్ఫాడించిన ఇషాన్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టీమిండియా ఫ్యూచర్ ప్లేయర్ తన దూకుడైన శైలితో, నిర్భయ బ్యాటింగ్ తో విదేశీ బౌలర్లకు ఒక పీడకలగా మారిపోతున్నాడు.

ఇషాన్ కిషన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. పవర్ ప్లేలో భారీ షాట్లు కొట్టగట సామర్థ్యం ఉంది. ఆరంభం నుంచే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తుంటాడు. ఇక ఫాస్ట్ బౌలర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా భారీ బౌండరీలతో ఆగమాగం చేస్తుంటాడు. ఇందుకు అతని స్ట్రైక్ రేట్ నిదర్శంగా నిలుస్తోంది.

దేశవాళీలో దుమ్మురేపిన ఛోటా ప్యాకెట్..

ఇషాన్ కిషన్ కొంతకాల జాతీయ క్రికెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ క్రికెట్‌లోకి ఎంటరై.. అద్భుతమైన ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. SMAT 2025లో ఏకంగా 10 ఇన్నింగ్స్‌లలో 517 పరుగుతో చెలరేగాడు. ఈసమయంలో ఇషాన్ స్ట్రైక్ రేట్ 197 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆ తర్వాత న్యూజిలాండ్‌ టీ20 సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చాడు. సెంచరీతో లెక్కలు మార్చేశాడు. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు రంకెలేస్తున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ గణాంకాలు..

ఇషాన్ కిషన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో డేంజరస్ బ్యాటర్ గా పేరుగాంచాడు. వచ్చిన కొద్ది అవకాశాలను వాడుకుంటూ ఈ ఫార్మాట్‌లో టీమిండియా తరపున సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో 36 టీ20ఐ మ్యాచ్‌లు ఆడి 1011 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 103గా నిలిచింది. సగటు 28.89, స్ట్రైక్ రేట్ 137.93తో డేంజరస్ బ్యాటర్ గా మారాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా 'ఛోటా ప్యాకెట్'
టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా 'ఛోటా ప్యాకెట్'
టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు..
టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు..
ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా..
ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..