AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 Schedule : క్రికెట్ ప్రపంచంలో మహా సంగ్రామం..20 జట్లు..55 మ్యాచ్‌లు..భారత్ గడ్డపై పరుగుల జాతర

T20 World Cup 2026 Schedule : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 సమరం ఫిబ్రవరి 7, శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి.

T20 World Cup 2026 Schedule : క్రికెట్ ప్రపంచంలో మహా సంగ్రామం..20 జట్లు..55 మ్యాచ్‌లు..భారత్ గడ్డపై పరుగుల జాతర
T20 World Cup 2026
Rakesh
|

Updated on: Feb 04, 2026 | 9:00 PM

Share

T20 World Cup 2026 Schedule : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 సమరం ఫిబ్రవరి 7, శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, తన తొలి మ్యాచ్‌ను ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో ఆడనుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముట్టాయి.

ఈ టోర్నీలో అత్యంత చర్చనీయాంశమైన విషయం బంగ్లాదేశ్ బహిష్కరణ. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తప్పించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చివరి నిమిషంలో చేర్చింది. ఇక భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌పై వేటుకు నిరసనగా తాము భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఒకవేళ పాక్ రాకపోతే ఆ పాయింట్లు భారత్‌కే దక్కుతాయి.

ఈసారి ఫైనల్ మ్యాచ్ వేదికపై ఐసీసీ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాలి. కానీ, ఒకవేళ పాకిస్థాన్ లేదా శ్రీలంక ఫైనల్‌కు చేరితే, అప్పుడు మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియానికి మారుతుంది. మిగతా ఏ జట్లు ఫైనల్ చేరినా అహ్మదాబాద్‌లోనే విజేత ఎవరో తేలుతుంది. సెమీఫైనల్స్ కోల్‌కతా, ముంబైలలో జరగనున్నాయి.

మొత్తం 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు

గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా.

గ్రూప్ B: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.

గ్రూప్ C: వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్.

గ్రూప్ D: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, కెనడా, యూఏఈ.

టీ20 వరల్డ్ కప్ 2026: పూర్తి మ్యాచ్‌ల జాబితా

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల వివరాలు ఇవే:

* ఫిబ్రవరి 7 (శనివారం):

పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ — కొలంబో (SSC) — ఉదయం 11:00

వెస్టిండీస్ vs స్కాట్లాండ్ — కోల్‌కతా — మధ్యాహ్నం 3:00

భారత్ vs అమెరికా — ముంబై — రాత్రి 7:00

* ఫిబ్రవరి 8 (ఆదివారం):

న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్థాన్ — చెన్నై — ఉదయం 11:00

ఇంగ్లాండ్ vs నేపాల్ — ముంబై — మధ్యాహ్నం 3:00

శ్రీలంక vs ఐర్లాండ్ — కొలంబో (RPS) — రాత్రి 7:00

* ఫిబ్రవరి 9 (సోమవారం):

స్కాట్లాండ్ vs ఇటలీ — కోల్‌కతా — ఉదయం 11:00

జింబాబ్వే vs ఒమన్ — కొలంబో (SSC) — మధ్యాహ్నం 3:00

సౌతాఫ్రికా vs కెనడా — అహ్మదాబాద్ — రాత్రి 7:00

* ఫిబ్రవరి 10 (మంగళవారం):

నెదర్లాండ్స్ vs నమీబియా — ఢిల్లీ — ఉదయం 11:00

న్యూజిలాండ్ vs యూఏఈ — చెన్నై — మధ్యాహ్నం 3:00

పాకిస్థాన్ vs అమెరికా — కొలంబో (SSC) — రాత్రి 7:00

* ఫిబ్రవరి 11 (బుధవారం):

సౌత్ ఆఫ్రికా vs ఆఫ్ఘనిస్థాన్ — అహ్మదాబాద్ — ఉదయం 11:00

ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ — కొలంబో (RPS) — మధ్యాహ్నం 3:00

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ — ముంబై — రాత్రి 7:00

* ఫిబ్రవరి 12 (గురువారం):

శ్రీలంక vs ఒమన్ — క్యాండీ — ఉదయం 11:00

నేపాల్ vs ఇటలీ — ముంబై — మధ్యాహ్నం 3:00

భారత్ vs నమీబియా — ఢిల్లీ — రాత్రి 7:00

* ఫిబ్రవరి 13 (శుక్రవారం):

ఆస్ట్రేలియా vs జింబాబ్వే — కొలంబో (RPS) — ఉదయం 11:00

కెనడా vs యూఏఈ — ఢిల్లీ — మధ్యాహ్నం 3:00

అమెరికా vs నెదర్లాండ్స్ — చెన్నై — రాత్రి 7:00

* ఫిబ్రవరి 14 (శనివారం):

ఐర్లాండ్ vs ఒమన్ — కొలంబో (SSC) — ఉదయం 11:00

ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్ — కోల్‌కతా — మధ్యాహ్నం 3:00

న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా — అహ్మదాబాద్ — రాత్రి 7:00

* ఫిబ్రవరి 15 (ఆదివారం):

వెస్టిండీస్ vs నేపాల్ — ముంబై — ఉదయం 11:00

అమెరికా vs నమీబియా — చెన్నై — మధ్యాహ్నం 3:00

భారత్ vs పాకిస్థాన్ — కొలంబో (RPS) — రాత్రి 7:00

* ఫిబ్రవరి 16 (సోమవారం):

ఆఫ్ఘనిస్థాన్ vs యూఏఈ — ఢిల్లీ — ఉదయం 11:00

ఇంగ్లాండ్ vs ఇటలీ — కోల్‌కతా — మధ్యాహ్నం 3:00

ఆస్ట్రేలియా vs శ్రీలంక — క్యాండీ — రాత్రి 7:00

* ఫిబ్రవరి 17 (మంగళవారం):

న్యూజిలాండ్ vs కెనడా — చెన్నై — ఉదయం 11:00

ఐర్లాండ్ vs జింబాబ్వే — క్యాండీ — మధ్యాహ్నం 3:00

స్కాట్లాండ్ vs నేపాల్ — ముంబై — రాత్రి 7:00

* ఫిబ్రవరి 18 (బుధవారం):

సౌతాఫ్రికా vs యూఏఈ — ఢిల్లీ — ఉదయం 11:00

పాకిస్థాన్ vs నమీబియా — కొలంబో (SSC) — మధ్యాహ్నం 3:00

భారత్ vs నెదర్లాండ్స్ — అహ్మదాబాద్ — రాత్రి 7:00

* ఫిబ్రవరి 19 (గురువారం):

వెస్టిండీస్ vs ఇటలీ — కోల్‌కతా — ఉదయం 11:00

శ్రీలంక vs జింబాబ్వే — కొలంబో (RPS) — మధ్యాహ్నం 3:00

ఆఫ్ఘనిస్థాన్ vs కెనడా — చెన్నై — రాత్రి 7:00

* ఫిబ్రవరి 20 (శుక్రవారం):

ఆస్ట్రేలియా vs ఒమన్ — క్యాండీ — రాత్రి 7:00

నాకౌట్ స్టేజ్ (Super 8, Semis, Final)

మార్చి 4: సెమీఫైనల్ 1 (కోల్‌కతా లేదా కొలంబో).

మార్చి 5: సెమీఫైనల్ 2 (ముంబై).

మార్చి 8: గ్రాండ్ ఫైనల్ (అహ్మదాబాద్ లేదా కొలంబో).

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి