AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31న బ్యాంకులను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానున్న క్రమంలో బ్యాంకులు ఓపెన్ చేసి ఉండనున్నాయి.

Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. బ్యాంకు సంఘాలు మంగళవారం బంద్‌ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ జరగనుంది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు రేపు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నాయి.
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 7:20 AM

Share

పబ్లిక్ హాలీడేస్‌తో పాటు రెండో, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో దేశంలోని బ్యాంకులన్నీ మూసివేసి ఉంటాయనే విషయం తెలిసిందే. ఆర్బీఐ ముందుగానే రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను పరిగణలోకి తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. దీంతో వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవులు వేరుగా ఉంటాయి. ఇక పబ్లిక్ హాలీడేస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. పరిస్థితిని బట్టి బ్యాంక్ సెలవుల్లో ఆర్బీఐ మధ్యలో మార్పులు చేయవచ్చు. తాజాగా ఆర్బీఐ బ్యాంకు సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సూచనలో బ్యాంకు సెలవుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా బ్యాంకు సెలవుల్లో చోటుచేసుకున్న మార్పులేంటి..? ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది..? అనే ఈ వివరాలు ఒకసారి చూద్దాం.

ఆ రోజున బ్యాంక్‌లకు సెలవు రద్దు

మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ పనిచేయనున్నాయి. ఆ రోజున మహావీర్ జయంతి ఉండటంతో గతంలో జారీ చేసిన హాలీడేస్ లిస్ట్ ప్రకారం బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ సెలవును రద్దు చేసిన ఆర్బీఐ.. ఆ రోజున బ్యాంకులు యధావిధిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మార్చిలో మహావీర్ జయంతితో సహా మొత్తం 11 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న క్రమంలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపు లావాదేవీలను నిర్వహించే బ్యాంక్ శాఖలను మార్చి 31న తెరిచి ఉంచాలని ఆర్బీఐని కేంద్రం కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనతో మార్చి 31న దేశంలోని బ్యాంకులన్నీ తెరిచి ఉంచాలని ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోనే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ప్రతీ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో నమోదు కావాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. దీంతో ప్రభుత్వ వ్యాపారంతో అనుసంధానించబడ్డ శాఖలు మార్చి 31న ఎప్పటిలాగే కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. కానీ కస్టమర్లు బ్రాంచ్‌ను సందర్శించేముందు ఒకసారి సిబ్బందితో ధృవీకరించుకుంటే మంచిది.

మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే..

ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకారం మార్చిలో 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 2న హోలికా దహన్, మార్చి 3న హోలీ, మార్చి4న హోలీ రెండో రోజు, మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 26న శ్రీరామనవమి, మార్చి 27న శ్రీరామ దావిన్ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

ఫిబ్రవరిలో సెలవులు

ఫిబ్రవరి 18న లోసర్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులు పనిచేయవు. ఇక ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు. ఇక ఫిబ్రవరి 20న మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్యాంకులను మూసివేయనున్నారు.

Follow Us
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..
ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..
పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి అప్పుడే..
మన పూర్వికులు చెప్పిన ఈ ఒక్క డ్రింక్ తో.. బరువు తగ్గడం ఖాయం
మన పూర్వికులు చెప్పిన ఈ ఒక్క డ్రింక్ తో.. బరువు తగ్గడం ఖాయం
లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది
లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది
జపం చేస్తున్నా ఫలితం రావట్లేదా? ఈ 7 నియమాలు పాటిస్తే దైవానుగ్రహం
జపం చేస్తున్నా ఫలితం రావట్లేదా? ఈ 7 నియమాలు పాటిస్తే దైవానుగ్రహం
మైగ్రేన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం..?
మైగ్రేన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం..?
స్వీటే కానీ యమ డేంజర్.. నేరేడు తిన్న తర్వాత ఇవి తింటే..
స్వీటే కానీ యమ డేంజర్.. నేరేడు తిన్న తర్వాత ఇవి తింటే..
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిసెస్ కేరళం హర్ష సన్నీ అరెస్ట్
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిసెస్ కేరళం హర్ష సన్నీ అరెస్ట్