AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: ఓటీటీలో ‘రానా నాయుడు’కు సూపర్ రెస్పాన్స్.. ఈ సిరీస్ కోసం వెంకీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..

ఈ సిరీస్ కోసం వెంకీ, రానా రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు అని. ఈ విషయాలపై అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Venkatesh: ఓటీటీలో 'రానా నాయుడు'కు సూపర్ రెస్పాన్స్.. ఈ సిరీస్ కోసం వెంకీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..
Rana Naidu
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2023 | 10:44 AM

Share

విక్టరీ వెంకటేశ్… దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్‏తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అరంగేట్రం చేశారు వీరిద్దరు. ఇందులో వెంకీ పూర్తి విభిన్న పాత్రల కనిపించారు. నిజ జీవితంలో బాబాయ్.. అబ్బాయ్‏గా ఉన్న వీరు.. ఇందులో తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సిరీస్‏లో రానా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా.. నేరం చేసి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన క్రిమినల్ గా వెంకీ కనిపించాడు. తండ్రిని విపరీతంగా ద్వేషించే కొడుకుగా రానా కనిపించారు. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ అవుతున్న రానానాయుడుకు సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే.. ఈ సిరీస్ కోసం వెంకీ, రానా రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు అని. ఈ విషయాలపై అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సిరీస్‏లో నటించేందుకు వెంకీ దాదాపు రూ. 12 కోట్లు తీసుకున్నట్లుగా టాక్. అలాగే.. రానా రూ. 8 కోట్లు తీసుకున్నట్లుగా సమచారం. హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్ కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించారు.

ఈ సిరీస్ లోని వెంకీ, రానా పాత్రలు నిజ జీవితాలకు పూర్తి భిన్నమైనవని.. ఇందులో చాలా డార్క్ షేడ్స్ ఉంటాయని.. ఈ సిరీస్ ను ఒంటరిగానే చూడాలని.. ఫ్యామిలీతో మాత్రం కలిసి చూడొద్దంటూ ప్రచార కార్యక్రమాల్లో రానా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌ ఒక ఆర్థిక శక్తిగా మారనుందా?
ఇరాన్‌ ఒక ఆర్థిక శక్తిగా మారనుందా?
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ధోని రాక మరింత లేట్.. ఎందుకంటే
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ధోని రాక మరింత లేట్.. ఎందుకంటే
హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ టార్గెట్?
హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ టార్గెట్?
ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం..
ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం..
వడ్డీతోనే రూ.4.40 లక్షల లాభం..రోజుకు రూ.300 పొదుపుతో రూ.15 లక్షలు
వడ్డీతోనే రూ.4.40 లక్షల లాభం..రోజుకు రూ.300 పొదుపుతో రూ.15 లక్షలు
రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా?
రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా?
ఈ ఒక్కటి చాలు.. మరకలు పట్టిన కుక్కర్‌ను క్షణాల్లో మెరిసిపోయేలా..
ఈ ఒక్కటి చాలు.. మరకలు పట్టిన కుక్కర్‌ను క్షణాల్లో మెరిసిపోయేలా..
'పెద్ది' సినిమాను ఆ నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
'పెద్ది' సినిమాను ఆ నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
చెవిలో గులిమి తీసుకోవాలా.. వద్దా?.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
చెవిలో గులిమి తీసుకోవాలా.. వద్దా?.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
రాత్రిపూట పండ్లు తింటే గుండెపోటు వస్తుందా? ఇదీ సంగతి..
రాత్రిపూట పండ్లు తింటే గుండెపోటు వస్తుందా? ఇదీ సంగతి..