AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sir OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలో పాఠాలు చెప్పనున్న సార్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న సార్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ధనుష్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Sir OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలో పాఠాలు చెప్పనున్న సార్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Sir Ott
Basha Shek
|

Updated on: Mar 12, 2023 | 2:29 PM

Share

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నేరుగా తెలుగులో నటించిన మొదటి చిత్రం సార్‌ (తమిళ్‌లో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. స‌ముద్ర‌ఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అక్కినేని సుమంత్ కూడా ముఖ్య పాత్రలో మెరిశాడు. జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ధనుష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది. చదువుకుందాం.. చదువు’కొన’కూడదు’ అని ధనుష్‌ చెప్పిన డైలాగులకు సినిమాలో విజిల్స్‌ పడ్డాయి. విద్యకు ఉన్న వ్యాల్యూ గురించి చర్చిస్తూనే మంచి మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు చోటివ్వడంతో సార్‌ సినిమా రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న సార్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ధనుష్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

సార్‌ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈక్రమంలో మార్చి 17 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ‘సార్‌ వస్తున్నాడు, అందరూ క్లాస్‌కు అటెండ్‌ అవ్వాల్సిందే’ అంటూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది. మరి థియేటర్లలో సార్‌ క్లాసులను మిస్‌ అయినవారు ఎంచెక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు