500ల సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్.. అప్పట్లోనే సొంత విమానం ఉన్న ఏకైక హీరోయిన్..
అప్పట్లో తిరుగులేని హీరోయిన్ ఆమె.. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు ఆమె.. హీరోయిన్ గా చేసిన హీరోలకే తల్లిగానూ నటించి మెప్పించారు ఆమె.. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించారు ఆమె. అంతే కాదు అప్పట్లోనే సొంత విమానం ఉన్న హీరోయిన్ ఆమె..

భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి ఆవిడ. తెలుగు ప్రేక్షకులకు ఆమె అంటే ఎనలేని గౌరవం, ప్రేమ. ఆమె ఎవరో కాదు కె.ఆర్. విజయ. ఈ అందాల నటిని “అమ్మవారి ప్రతిరూపం”గా పిలుస్తారు, ఆమె పోషించిన దేవతా పాత్రలు, స్వచ్ఛమైన నవ్వు అందుకు ప్రధాన కారణాలు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆమె సినీ ప్రస్థానం అనేక మలుపులు, విజయాలతో నిండి ఉంది. కేరళలో రామచంద్రన్ నాయర్, కళ్యాణి దంపతులకు దైవనాయకిగా జన్మించిన కె.ఆర్. విజయ, నలుగురు అక్కాచెల్లెళ్లలో పెద్దవారు. ఆమె సోదరి కె.ఆర్. వత్సల కూడా నటీమణే. చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విజయకు, రంగస్థల నటుడైన ఆమె తండ్రి రామచంద్రన్ నాయర్ నటన పట్ల ఆసక్తిని, ప్రోత్సాహాన్ని అందించారు. ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు కె.ఎస్. గోపాలకృష్ణన్ కె.ఆర్. విజయను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆసక్తికరంగా, కె.ఎస్. గోపాలకృష్ణన్ ఆమె మొదటి చిత్రానికి, అలాగే ఆమె 100వ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.
ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా
కె.ఆర్. విజయ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆమె కెరీర్ ప్రారంభంలో ఎం.జి. రామచంద్రన్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, జయశంకర్, ముత్తురామన్ వంటి ప్రముఖ నటులకు జోడీగా నటించారు. తెలుగులో ఎన్.టి. రామారావు “శ్రీకృష్ణ పాండవీయం” చిత్రంలో రుక్మిణి పాత్రతో ఆమెను పరిచయం చేశారు. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావుతో “సిపాయి చిన్నయ్య”, కాంతారావుతో “ఏకవీర” వంటి చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆమె స్వచ్ఛమైన నవ్వు, దైవిక రూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “సర్వర్ సుందరం” చిత్రంలో ఆమె నటనకు రాష్ట్ర అవార్డు కూడా లభించింది. సుమారు 20 సంవత్సరాల పాటు విజయవంతమైన హీరోయిన్ కెరీర్ తర్వాత, కె.ఆర్. విజయ సహాయ నటిగా మారారు. ఆమె ఏ హీరోలతో హీరోయిన్‌గా నటించారో, వారికే తల్లి పాత్రలలో లేదా ఇతర సహాయ పాత్రలలో నటించి తన వృత్తి పట్ల అంకితభావాన్ని చాటారు. “విశ్వనాథ నాయకుడు” చిత్రంలో శివాజీ గణేషన్ భార్యగా, కృష్ణ తల్లిగా నటించారు. బాలకృష్ణతో “భైరవ ద్వీపం”, “శ్రీకృష్ణార్జున విజయం”, “సింహా” వంటి చిత్రాలలో కూడా ఆమె ముఖ్య పాత్రలు పోషించారు.
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే
పౌరాణిక చిత్రాలలో తల్లి, దేవతా పాత్రలకు ఆమె జీవం పోశారు, “భక్త పోతన”లో భార్యగా, “త్యాగయ్య”లో కమలాంబగా, “కుంతి పుత్రుడు”లో మోహన్ బాబు తల్లిగా నటించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన “శ్రీరామరాజ్యం”లో కౌసల్య పాత్ర ఆమె కెరీర్‌లో మరొక ముఖ్యమైన ఘట్టం. ఆమె వ్యక్తిగత జీవితం కూడా విజయవంతమైంది. 1966లో, సినీ రంగంలోకి ప్రవేశించిన మూడు సంవత్సరాల తర్వాత, ప్రఖ్యాత వ్యాపారవేత్త వేలాయుధన్‌ను వివాహం చేసుకున్నారు. వేలాయుధన్ చెన్నైకి చెందిన సుదర్శన్ చిట్ ఫండ్స్ సీ.ఈ.ఓ.గా ఉండేవారు. ఆ కాలంలోనే సొంతంగా ప్రైవేట్ విమానం కొనుగోలు చేసిన ఏకైక నటిగా కె.ఆర్. విజయ నిలిచారు, దానిని ఆమె చెన్నైలోని తన పెద్ద ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసేవారు. ఈ దంపతులకు హేమలత అనే కుమార్తె ఉన్నారు. కాగా విజయ టీవీ సీరియల్స్‌లో కూడా చురుకుగా పాల్గొని, దాదాపు 25 సీరియల్స్‌లో నటించారు.
ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

Kr Vijaya




