కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గత ఏప్రిల్ 25న వివాహం జరిగిన నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి, పెళ్లయిన నెలలోపే పుట్టింట్లో ఉరివేసుకొని చనిపోయింది. భర్త గాది కోటేశ్వరరావు మానసిక, శారీరక వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.