ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌గా.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అర్రే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా.. ఆమె మరోసినిమాలో కనిపించడం లేదు. కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాతో మెప్పించింది ఓ హీరోయిన్. చిన్న సినిమాగా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది. ఫస్ట్ మూవీతోనే కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అవుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదండి.. హుషారు మూవీ బ్యూటీ.. ప్రియా వడ్లమాని.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
2018లో వచ్చిన హుషారు సినిమాతో తెలుగు సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ప్రేమించిన వాడిని మోసం చేసే అమ్మాయిగా నటించి మెప్పించింది. హుషారు సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. అంతకు ముందు ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే చాలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
కానీ ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. హుషారు మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ అందుకోలేదు. శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో కనిపించింది. అంతకు ముందు.. ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో నటించింది. ఇక వీరాంజనేయులు విహార యాత్ర అనే సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ప్రియా వడ్లమాని. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








