12మందితో ఎఫైర్స్.. పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి.. ఇప్పటికీ సింగిల్ గా ఉంటున్న హీరోయిన్
చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి అనే టాపిక్ లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది.

బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచానికి అందరూ ఆకర్షితులవుతారు. ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటీనటులకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు నెటిజన్స్. అయితే కొందరు సెలబ్రెటీస్ మాత్రం తమ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. తమ అభిమాన హీరోహీరోయిన్స్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు.. ? ఎక్కడికి వెళ్తారు అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ గురించి నెట్టింట ట్రెండ్ అవుతుంటారు. 12 మందితో ప్రేమాయణం సాగించింది.. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. 49 ఏళ్ల వయసులో కూడా ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ, ఆమె అందం, ఫిట్‌నెస్ కారణంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను ఇప్పటికీ శాసిస్తోంది. ఆమె ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్. నవంబర్ 19, 1975న హైదరాబాద్ జన్మించింది. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఆమె. ఆ తర్వాత 1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. నటనతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో నిలుస్తుంది. ఆమె పేరు 12 మంది హీరోలతో ముడిపడి ఉంది. ఇందులో విక్రమ్ భట్, రోహ్మాన్ షాల్, రణదీప్ హుడా, లలిత్ మోడీ, వసీం అక్రమ్ వంటి అనేక మంది పెద్ద పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పటికీ సుష్మితా ఎవరినీ వివాహం చేసుకోలేదు.
ఇది కూడా చదవండి :నాన్న ప్రతిరూపం మా తారకరాముడు..! అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో
సుష్మితా సేన్ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకుంది. అలాగే రెనే, అలిసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. సుష్మిత నేడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన వర్కౌట్ వీడియోలు, స్టైలిష్ ఫోటోషూట్‌లు తన కూతుర్లతో గడిపే క్షణాలను షేర్ చేస్తుంటుంది. హిందీతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.
ఇది కూడా చదవండి :ఈ అమ్మాయి కళ్ళతోనే కట్టిపడేసింది.. రాజమౌళికి బాగా నచ్చిన హీరోయిన్ ఈ అమ్మడేనట
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








