ఎనిమిది సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్.. ఇంకా ఎన్నాళ్ళు అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? ఎనిమిది సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్ అందుకుంది ఈ అమ్మడు. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరసకు అందరి సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా,.?

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను.. అయితే అందరికి అదృష్టం కలిసి రాదు. కొంతమంది వరుసగా విజయాలను అనుకుంటుంటే మరికొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా హిట్స్ మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ ఖాతాలో హిట్స్ మాత్రం పడటం లేదు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. డాన్స్ ఇరగదీస్తోంది, గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది. యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది. కానీ ఎందుకనో ఆమె సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదు. ఇప్పటికే ఎనిమిది సినిమాలు చేస్తే రెండు సినిమాలే హిట్ అయ్యాయి. అయినా కూడా ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో.. ఆమె కహాని ఏంటో చూద్దాం..!
పై ఫొటోలో ఉన్న యంగ్ బ్యూటీ ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరెట్. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే ఎక్కడ విన్నా ఆమె పేరే.. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్ళిసందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
రవితేజ నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసిన హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. చాలారోజులతర్వాత బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత మరో హిట్ పడలేదు ఈ అమ్మడికి.. చివరిగా నటించిన రాబిన్ హుడ్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడికి హిట్స్ పడకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. అలాగే రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..