చేసిన ఒక్క సినిమా కూడా అట్టర్ ఫ్లాప్.. కానీ అందంలో, క్రేజ్‌లో పీక్ ఈ అమ్మడు
చాలా మంది హీరోయిన్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ఈ నటిని గుర్తుపట్టారా.? ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్.

హీరోయిన్స్ సినిమాల్లో పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంటారు. ఇక ముద్దుగుమ్మలు ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథకు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటూ నటనతో ఆకట్టుకుంటున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పాత్ర కోసం ఎలా కావాలంటే అలా తమ శరీరాన్ని మార్చుకుంటున్నారు హీరోయిన్స్. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు అందగత్తెలు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బొద్దుగా మారిన ఆమె ఇప్పుడు సన్నజాజిలా మారిపోయి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.
రజిషా విజయన్.. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ప్రధానంగా మలయాళ సినిమా రంగంలో పనిచేస్తుంది. 1991 జూలై 15న కేరళలోని కోళికోడు జిల్లా కాలికట్‌లో జన్మించింది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసింది. ఈ ముద్దుగుమ్మ . 2016లో “అనురాగ కరిక్కిన్ వెల్లం” సినిమాతో మలయాళ సినిమా రంగంలోకి అడుగుపెట్టి, తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకుంది.
ఆ తర్వాత “జూన్”, “స్టాండ్ అప్”, “ఫైనల్స్” వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె నటనలో సహజత్వం, విభిన్న పాత్రలను పోషించే సామర్థ్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. రజిషా తమిళతోపాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన “రామారావు ఆన్ డ్యూటీ ” సినిమాలో నటించి మెప్పించింది. టెలివిజన్‌లో హోస్ట్‌గా చేసిన సమయంలో మలయాళంలో పలు షోలను నిర్వహించింది. విభిన్న కథలను ఎంచుకుంటూ నటిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కాగా ఈ మధ్య కాస్త బొద్దుగా మారిన ఈ అమ్మడు ఇప్పుడు జిమ్ లో కష్టపడి మరోసారి సన్నజాజిలా మారిపోయింది.
View this post on Instagram
రజిషా విజయన్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.