60 ఫ్లాపులు.. పోస్టర్ మీద ఫోటో కూడా వెస్ట్ అంటూ అవమానాలు.. కట్‌చేస్తే ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరో
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది హీరోలు ఫ్లాప్స్ తో కృంగిపోతూ ఉంటారు. కానీ ఓ హీరో మాత్రం 60 ఫ్లాప్స్ అందుకున్నా ఎక్కడా నిరాశ పడకుండా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఒకొక్క సినిమాకు రూ. 80కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో..

సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న చాలామంది నటుల జీవితాలు కష్టాలు, పోరాటాలతో నిండి ఉన్నాయని చెప్పాలి. ఎంతో మంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను, అవమానాలు ఎదుర్కొని ఆతర్వాత స్టార్స్ గా మారారు. అలాంటి వారిలో ఎంతో మంది ఉన్నారు. కాగా ఇండస్ట్రీలో 60ఫ్లాపులు అందుకున్న ఏకైక హీరో ఎవరో తెలుసా.? ఎన్నో సినిమాల్లో నటించిన ఆ హీరోకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హిట్స్ లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎవరో కాదు. ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి అక్షయ్ కుమార్ చాలా పోరాటాలు, ఎదురుదెబ్బలు తిని ఆపై కంబ్యాక్ ఇచ్చాడు.
OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..
అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. ఆయన 1967 సెప్టెంబర్ 9న ఢిల్లీలో జన్మించారు. 1991 జనవరి 25న విడుదలైన సౌగంధ్ చిత్రంతో ఆయన సినిమా రంగంలో అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీలో 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత, యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఖిలాడితో అక్షయ్ కుమార్ తన మొదటి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఆయనకు ఖిలాడీ కుమార్ అనే పేరు కూడా వచ్చింది. అయితే, ఆయన కెరీర్ 1990ల చివర్లో కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఆయన వరుసగా 16 ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నారు. వరుస వైఫల్యాలతో బాలీవుడ్‌లో ఆయనకు భవిష్యత్తు లేదని చాలామంది భావించారు. ఆ కష్టకాలంలో, ఒక నిర్మాత అక్షయ్ కుమార్ ను తీవ్రంగా అవమానించాడట. ఈ ఘటన గురించి నిర్మాత సునీల్ దర్శన్ మాట్లాడుతూ. సినిమా పోస్టర్‌లో కూడా అక్షయ్ ఫోటో వేయమని ఓ నిర్మాత అన్న ఆ మాటలకు అక్షయ్ కుమార్ ఎంతో బాధపడ్డారని సునీల్ దర్శన్ తెలియజేశారు.
మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా
అయితే, ఈ అవమానంతో అక్షయ్ కృంగిపోలేదు. బాలీవుడ్‌ను విడిచిపెట్టాలనే ఆలోచన చేయకుండా, మరింత కష్టపడాలని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత సునీల్ దర్శన్, అక్షయ్ కుమార్ కు తన ధడ్కన్ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను అందించారు. ఇది అక్షయ్ కుమార్ కెరీర్‌కు ఒక మలుపు తిప్పడానికి సహాయపడింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హెరా ఫేరి వంటి కామెడీ చిత్రంతో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అక్షయ్ పర్ఫెక్ట్ కామిక్ టైమింగ్, మరుపురాని పాత్ర ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో అక్షయ్ కుమార్ కెరీర్ కు కీలక మలుపు తిరిగింది. జీవితంలో వైఫల్యాలు తాత్కాలికమే అని ఆయన నిరూపించారు. అప్పటినుంచి అక్షయ్ కుమార్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ, కష్టపడి పనిచేశారు. అప్పటినుండి వెనుతిరిగి చూసుకోలేదు. దశాబ్దాలుగా బాలీవుడ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం, అక్షయ్ కుమార్ నికర విలువ సుమారు రూ. 2,700 కోట్లు. ఆయన బాలీవుడ్‌లోని అత్యంత ధనవంతులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఒక సినిమాకు సుమారు రూ. 80 కోట్లు వసూలు చేస్తున్నారు. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో ఆయన శివుడి పాత్రలో కనిపించరు.
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




