Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!
అనకాపల్లి జిల్లాలో భారీ గిరి నాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ పశువుల షెడ్డులోకి దూరింది. భుసలు కొడుతూ భయపెట్టింది. పశువుల పాకలోనే నిద్రిస్తున్న రైతు శేఖర్.. శబ్దాలు విని వణికిపోయాడు. భయంతో వణికిపోయాడు. తీరా చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరులో అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. శేఖర్ అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. పదమూడు అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులో దూరింది. పశువుల పాకలోనే సేదతీరుతో నిద్రించాడు రైతు శేఖర్. గోడ నిద్రలో ఉన్న సమయంలో.. వింత శబ్దం వస్తుండడంతో శేఖర్ ఒక్కసారిగా తుళ్ళిపడి తొంగి చూశాడు. దీంతో ఆ భారీ గిరి నాగు తిష్ట వేసుకుని కూర్చుని కనిపించింది. దీంతో గుండెల్లో పట్టుకొని భయభ్రాంతులకు గురైన రైతు.. అక్కడ నుంచి పరుగులు తీశాడు. స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. రంగంలో ఒక దిగిన స్నేక్ క్యాచర్.. రెండు గంటల పాటు శ్రమించి 13 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!
తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు
పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి
జాతరలో తేనెటీగల బీభత్సం
రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి

