ఇరాన్ నుంచి అమెరికాకు ‘పెద్ద బహుమతి’ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక కీలక మలుపు తిరిగాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ నుంచి తమకు ఒక 'అద్భుతమైన బహుమతి' లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్.. ఇరాన్ తమకు అద్భుతమైన బహుమతిని పంపిందని, అది తమకు ఈరోజే చేరిందని, అది చాలా విలువైనదని పేర్కొన్నారు. అయితే ఆ ‘బహుమతి’ అణు సంబంధమైనది కాదని, అది చమురు మరియు గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి కి సంబంధించినదని తెలుస్తోంది. ఇంధన సరఫరా మార్గాలపై ఇరాన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశం. ఇకపై అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ నాయకత్వంలో ఇప్పటికే సానుకూల మార్పులు వచ్చాయని, ఆ దేశంలోని సరైన వ్యక్తులతోనే తాము చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల కోసం ట్రంప్ ఒక శక్తివంతమైన బృందాన్ని ప్రకటించారు. ఇందులో..ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఉంటారని పేర్కొన్నారు. యుద్ధం ఇంత త్వరగా ముగియడంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కొంత నిరాశ చెందినట్లు ట్రంప్ చమత్కరించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!

