AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Sale : నాడు నవ్విన వారికే షాక్.. ఆర్సీబీ మెగా డీల్‌పై విజయ్ మాల్యా రియాక్షన్..!

RCB Sale : ఆర్సీబీ రూ. 16,700 కోట్లకు అమ్ముడవ్వడంపై విజయ్ మాల్యా స్పందించారు. నాడు విమర్శించిన వారికి ఈ ధర చెంపపెట్టు అని, విరాట్ కోహ్లీ వల్లే జట్టుకు ఈ స్థాయి వచ్చిందని ఆయన కొనియాడారు. విజయ్ మాల్యా తన తాజా ఎక్స్ పోస్ట్‌లో 2008 నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

RCB Sale : నాడు నవ్విన వారికే షాక్.. ఆర్సీబీ మెగా డీల్‌పై విజయ్ మాల్యా రియాక్షన్..!
Rcb Vijay Mallya
Rakesh
|

Updated on: Mar 26, 2026 | 12:10 PM

Share

RCB Sale : ఐపీఎల్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గురించే చర్చ. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్సీబీని సుమారు రూ.16,700 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక డీల్‌పై ఆర్సీబీ మాజీ బాస్, లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా స్పందించారు. 2008లో తాను పెట్టిన పెట్టుబడి నేడు 37 రెట్లు పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఎమోషనల్ పోస్ట్ చేశారు. అప్పట్లో తనను చూసి నవ్విన వారందరికీ ఇప్పుడు బుద్ధి వచ్చి ఉంటుందని పరోక్షంగా చురకలు అంటించారు.

నాడు వెక్కిరింపులు.. నేడు రికార్డులు

విజయ్ మాల్యా తన తాజా ఎక్స్ పోస్ట్‌లో 2008 నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. “నేను 2008లో ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు కొన్నప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుకున్నారు. నా ఇన్వెస్ట్‌మెంట్‌ను కేవలం ఒక షో పుటప్ అని విమర్శించారు. కానీ నా ఉద్దేశ్యం ఒక్కటే.. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడం. అందుకే దీనికి ఆర్సీబీ అని పేరు పెట్టాను. ఈ రోజు నా రూ.450 కోట్ల పెట్టుబడి ఏకంగా రూ.16,500 కోట్లకు పైగా పెరగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అని మాల్యా పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీయే అసలైన బలం

ఆర్సీబీకి ఈ స్థాయిలో బ్రాండ్ వాల్యూ రావడానికి గల ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని మాల్యా కొనియాడారు. “ఒక యువకుడిగా ఉన్నప్పుడే విరాట్ కోహ్లీని మా జట్టులోకి తీసుకున్నాం. ఈ రోజు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు. ఆర్సీబీకి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, పంజాబ్ వంటి నగరాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం కోహ్లీనే. ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే” అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోహ్లీని జట్టులోకి తీసుకున్న ఆ క్షణాలు తన జీవితంలో మరుపురానివని ఆయన చెప్పారు.

కొత్త యజమానులకు అభినందనలు

ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థ ఆర్సీబీని హస్తగతం చేసుకోవడంపై మాల్యా సంతోషం వ్యక్తం చేశారు. కొత్త యజమానులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ.. ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్సీబీ అభిమానులు ఎల్లప్పుడూ జట్టుకు అండగా నిలవాలని, ఈ బ్రాండ్ విలువను మరింత పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో యునైటెడ్ స్పిరిట్స్ ఆధీనంలో ఉన్న ఈ జట్టు, ఇప్పుడు ఐపీఎల్ 2026 నుండి కొత్త మేనేజ్‌మెంట్ కింద రంగంలోకి దిగనుంది.

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం

విజయ్ మాల్యా చెప్పినట్లుగా, ఐపీఎల్ ప్రారంభంలో జట్లు నష్టాల్లో ఉంటాయని అందరూ భావించారు. కానీ 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విలువ 37 రెట్లు పెరగడం అనేది భారత క్రీడా రంగంలోనే ఒక విస్మయం. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ డీల్‌లో భాగస్వాములు కావడంతో ఆర్సీబీ ఇకపై గ్లోబల్ స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మారనుందని వెబ్ సైట్లలో విశ్లేషణలు వస్తున్నాయి. యజమానులు మారినా, ఆర్సీబీ అనే పేరును అలాగే ఉంచాలని నిర్ణయించుకోవడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us