ధోని తర్వాత అతనే కెప్టెన్ అనుకున్న..! మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్
భారత క్రికెట్ చరిత్రలో ధోని మూడు ఐసీసీ ట్రోఫీలతో మహోన్నత కెప్టెన్‌గా నిలిచాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లీ భారత జట్టును నడిపించగలడని రవిశాస్త్రి ముందే గుర్తించారు. ధోని వారసత్వాన్ని కోహ్లీ సమర్థవంతంగా కొనసాగించి, ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాను ప్రపంచ ఆధిపత్య శక్తిగా మార్చాడు. ధోని సైతం కోహ్లీని తన వారసుడిగా చూశాడు.

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ధోని కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది భారత జట్టు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని పేరు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. ధోని కెప్టెన్సీలో టీమిండియా ఒక స్వర్ణ యుగంలో ప్రయాణించదని చెప్పవచ్చు. అలాంటి ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే భారత జట్టును ఎవరు నడిపిస్తారనే కంగారు అప్పట్లో క్రికెట్ అభిమానుల్లో ఉండేది. వాటికి సమాధానంగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అయితే ధోని తర్వాత టీమిండియా కెప్టెన్‌గా ఎవరు అవుతారనే విషయం తానకు ముందే తెలిసిందంటూ టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి తెలిపారు. ధోని రిటైర్మెంట్‌కి ముందు విరాట్ కోహ్లీ నెక్ట్స్ లీడర్ అనే విషయాన్ని తాను చాలా త్వరగా గుర్తించాను అంటూ రవి శాస్త్రి వెల్లడించారు. విరాట్ కోహ్లీలో ఉన్న ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ తనకు ముందు తెలిసినట్లు ఆయన పేర్కొన్నారు. విరాట్ కోహ్లీని చూసిన ప్రతి సారి.. దిగ్గజ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్ తన ఆలోచనల్లోకి వస్తాడని ఆయన తెలిపారు.
కాగా ధోని తర్వాత ఆ లెగసీని విరాట్ కోహ్లీ సైతం కొనసాగించిన విషయం తెలిసిందే. కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీ రాలేదనే మాటే కానీ.. ప్రపంచ క్రికెట్‌పై భారత జట్టు ఆధిపత్యం మాత్రం అలాగే కొనసాగింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. కోహ్లీ కెప్టెన్సీలో భారత టెస్ట్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరాగా చెప్పవచ్చు. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌ను కోహ్లీ సేన శాసించింది. కొమ్ములు తిరిగిన ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది కోహ్లీ కెప్టెన్సీలోనే. ధోని తర్వాత టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ అవుతాడనే విషయాన్ని శాస్త్రితో పాటు ధోని కూడా గ్రహించాడు. తన తర్వాత కోహ్లీ చూసుకుంటాడని బీసీసీఐ పెద్దలకు చెప్పి మరీ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
