హైదరాబాద్ జవహర్ నగర్లో ఏడాది క్రితం జరిగిన తల్లి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రేమకు అడ్డు వస్తుందని కూతురు ఇషికా ప్రియుడితో కలిసి తల్లి అంజును చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. మిస్సింగ్ కేసుగా నటిస్తూ వచ్చిన ఇషికా, తల్లి వాహనం అమ్మకంతో పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసులో కూతురు, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.