మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని తగలబడిపోయారు.

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని తగలబడిపోయారు.
మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చాలామందికి 40 శాతం వరకు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొందరికి విరిగిపోయిన కాళ్లూ చేతులు.. మరికొందరికి తలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 13 మందిని ఒంగోలు రిమ్స్‌కి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ.
ఇదిలావుంటే, మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర టిప్పర్‌ను ఢీకొట్టింది సీటర్ కమ్ స్లీపర్ నాన్ AC బస్సు హరికృష్ణ ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్‌ను ట్రావెల్స్ బస్సు వేగంగా, బలంగా ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవదహనమైపోగా.. మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని మంటల్లో కాలిపోయారు. ప్రయాణికులంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే, ప్రమాదస్థలి భయానకంగా మారింది. దీంతో బస్సు ప్రమాద బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. గుర్తించలేని స్థితిలో బస్సు ప్రమాద మృతులు ఉన్నారు. పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారిన డెడ్‌బాడీస్‌ను సేకరించి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను తరలించారు. DNA ఆధారంగా మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే మృతులు, క్షతగాత్రులందరూ 30 ఏళ్ల లోపు వాళ్లే కావడం విశేషం. మరోవైపు, తమ వాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలియక మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో పడిగాపులు పడుతున్నారు కుటుంబసభ్యులు.
బస్సులో కనిగిరి నియోజకవర్గానికి చెందినవాళ్లు 25మంది వరకు ఉన్నట్టు తెలిసిందని MLA ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. 20మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మిగతావాళ్లు చనిపోయినట్టు తెలుస్తోందన్నారు. బస్సు ప్రమాదంలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వాళ్లు 10మంది వరకు ఉన్నారన్నారు MLA కాకర్ల సురేష్. ప్రస్తుతం వాళ్ల కండీషన్ ఎలా ఉందో ఆరా తీస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
