పచ్చి క్యారెట్ తింటున్నారా? మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసా

26 March 2026

TV9 Telugu

TV9 Telugu

క్యారెట్లు నారింజ రంగులో అందంగా కనిపించడమే ఆరోగ్యానికెంతో మంచిది. వాటివల్ల ఎన్ని లాభాలున్నాయి. క్యారెట్‌లో ఎ,సి,కె,బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం

TV9 Telugu

క్యారెట్‌ తింటే కళ్లకు మంచిదని చాలా మందికి తెలిసిన విషయమే. దంతాలకు కూడా క్యారెట్‌ మేలు చేస్తుందని మీకు తెలుసా? అవును.. క్యారెట్‌ను నేచురల్‌ టూత్‌ బ్రష్‌ అని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ఇవి తినడం వల్ల పళ్లు శుభ్రం కావడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. క్యారెట్‌ నమలడం వల్ల దంతాలపై ఉండే జిగట తొలగిపోతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్లు ఏ, కే, బయోటిన్‌.. దంతాల చిగుళ్ల బలం పెరగడంలో సాయపడతాయి

TV9 Telugu

అలాగే నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తం ఎక్కువ పోవడం లాంటి సమస్యలను నివారిస్తాయి. మెనోపాజ్‌ దశలో ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం, మూడ్స్‌ మారిపోవడం కద్దు. అలాంటప్పుడు రోజూ ఒక క్యారెట్‌ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

గర్భిణిగా ఉన్నప్పుడు, శిశువు పుట్టాక క్యారెట్లు తినడం వల్ల పాలు పడతాయి. అమ్మాయిలు ఎక్కువగా బాధ పడే అంశాల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. క్యారెట్లు తినడం వల్ల జుట్టు రాలదు, బాగా పెరుగుతుంది

TV9 Telugu

చర్మానికి నిగారింపు వస్తుంది. ముడతలు రానీయవు కనుక వయసు మీదపడినట్లు అనిపించదు. ఆకలిని పెంచుతాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తాయి

TV9 Telugu

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమౌతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి

TV9 Telugu

వీటిలో కొవ్వు ఉండదు, కెలొరీలు తక్కువ కనుక ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవెంతో ఉపకరిస్తాయి. పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాలనుకునే తల్లులు ఏదో రూపంలో చిన్నారుల చేత క్యారెట్‌ తినిపిస్తారు