AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌ లొకేషన్‌ లో సందడి చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమాలు

ఆన్‌ లొకేషన్‌ లో సందడి చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమాలు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 11:01 PM

Share

వేసవి వచ్చిందంటే టాలీవుడ్‌లో స్పోర్ట్స్ డ్రామాల సందడి మొదలైంది. చిరంజీవి (చెర్రి) 'పెద్ది'లో క్రికెట్ సహా పలు క్రీడల్లో, శర్వానంద్ 'బైకర్'లో మోటో క్రాస్‌లో, సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో పిస్టల్ షూటింగ్‌లో అలరించనున్నారు. విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ కూడా రాబోయే చిత్రాల్లో క్రీడాకారులుగా కనిపించనున్నారు. ఈ కొత్త ట్రెండ్ సినీ అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

సమ్మర్‌ వచ్చిందంటే అందరికీ సందడే సందడి. ఎంచక్కా ఆడుకోవచ్చని అనుకుంటారు పిల్లలు. సిల్వర్‌స్క్రీన్‌ మీద మేం కూడా ఆ పనే చేస్తున్నామని అంటున్నారు కొందరు హీరోలు. తెలుగు తెరకు కొత్త కాకపోయినా, స్పోర్ట్స్ డ్రామాలు మాత్రం ఎంచక్కా రెడీ అయిపోతున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు? ఎవరా ఆటగాళ్లు? హావ్‌ ఎ లుక్‌… మళ్లీ మళ్లీ పుడతామా ఏటి అంటూ పలు రకాల క్రీడలను సిల్వర్‌ స్క్రీన్‌ మీద టచ్‌ చేయడానికి రెడీ అయిపోయారు మిస్టర్‌ చెర్రి. పెద్దిలో ఆయన ఎన్ని రకాల క్రీడల్లో ప్రావీణ్యం చూపిస్తారోనని వెయిటింగ్‌ అభిమానులు. పెద్ది క్రికెట్‌ షాట్‌తో సహా ఆకట్టుకుంటున్నాయి ప్రచార చిత్రాలు ఏప్రిల్‌లో స్పోర్ట్స్ డ్రామా బైకర్‌తో పలకరించనున్నారు శర్వానంద్‌. మోటో క్రాస్‌ రేసింగ్‌ తో ముడిపడిన ఈ సినిమా కోసం భారీగా వెయిట్‌ తగ్గారు శర్వానంద్‌. రేసర్‌గా ఆయన చేసిన విన్యాసాలు సినిమాకు హైలైట్‌ అని మేకర్స్ చెబుతున్నారు. ఇటు డార్లింగ్‌ ట్రైలర్‌ మీద ప్రశంసల వర్షం కురిపించిన తీరు కూడా భీభత్సంగా హైప్‌ క్రియేట్‌ చేసింది. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ పబ్లిసిటీ వీడియో చూసిన వారికి సూర్య, మమిత మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగా నచ్చాయో, ఇందులో సూర్య చేసే కేరక్టర్‌ మీద కూడా ఫోకస్‌ అంతే పెరిగింది. పిస్టల్‌ షూటింగ్‌తో ముడిపడిన సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందింది. కంటిచూపుకు 40ల్లో ఉండే పదును గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన పనులతో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ, ఆ నెక్స్ట్ చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రామానే అంటోంది ఇండస్ట్రీ. విక్రమ్‌ కె కుమార్‌ చెప్పిన స్పోర్ట్స్ డ్రామా ఔడీ హీరోకి చాలా బాగా నచ్చిందని ‘స్వారీ’ అనే పేరు ప్రచారంలో ఉందని మాట్లాడుకుంటోంది ఇండస్ట్రీ. ప్రస్తుతం రణబాలి పనుల్లో బిజీగా ఉన్నారు విజయ్‌.ప్రస్తుతం కొరియన్‌ కనకరాజుగా నటిస్తున్నారు వరుణ్‌ తేజ్‌. ఈ సినిమా తర్వాత తన సోదరి నీహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమాలో నటించనున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్‌ యదువంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఇందులో వరుణ్‌ వాలీబాల్‌ ఆటగాడిగా కనిపిస్తారు. కొరియన్‌ కనకరాజు రిలీజ్‌ అయ్యాక వాలీబాల్‌ మీద ఫోకస్‌ చేస్తారు వరుణ్‌తేజ్‌

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??

హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు

Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ

తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

Follow Us