Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను ప్రకటించింది. మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు పెన్షన్ పెంపు, మహిళలకు ఆర్థిక సాయం రెట్టింపు, ఫ్రిడ్జ్, స్కూటీ సబ్సిడీ వంటి ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించింది. డీఎంకేతో పాటు ఇతర పార్టీల మేనిఫెస్టోలపై ఆసక్తి నెలకొంది.
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఉచిత పథకాల యుద్ధం ముదిరింది. అధికార డీఎంకే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, ఇప్పుడు అన్నాడీఎంకే తన మేనిఫెస్టోతో అడుగులు ముందుకేసింది. అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు మాత్రమే ఉన్న ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇకపై పురుషులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇది కాకుండా, వృద్ధుల పెన్షన్ పెంపు, మహిళలకు అందే ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేయడం, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఉచిత ఫ్రిడ్జ్, మహిళలకు స్కూటీ కొనుగోలుపై భారీ సబ్సిడీ, ఇల్లు లేని పేదల కోసం కొత్త ఇళ్ల నిర్మాణం వంటి ఆకర్షణీయమైన హామీలను ఇచ్చింది. ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ఈ పథకాలను రూపొందించింది. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే !!
ఇండస్ట్రీలో విషాదం.. యంగ్ హీరోయిన్
Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలకు రెక్కలు
ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే
ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

