AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్రా మీరంతా.. ఏఐతో ఆ ఫోటోలు సృష్టించారు.. కట్ చేస్తే.. చివరికి.!

టిపెన్సిల్వేనియాలోని లాంకాస్టర్‌లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఇద్దరు టీనేజ్ బాలురు, తమ తోటి విద్యార్థుల అశ్లీల చిత్రాలను సృష్టించడానికి కృత్రిమ మేధను ఉపయోగించినట్లు అంగీకరించారు. దీంతో బుధవారం (మార్చి 25) రోజున ఆ ఇద్దరు విద్యార్థులు ప్రొబేషన్‌కు గురయ్యారని పోలీసలు తెలిపారు.

ఎవర్రా మీరంతా.. ఏఐతో ఆ ఫోటోలు సృష్టించారు.. కట్ చేస్తే.. చివరికి.!
Lancaster
Balaraju Goud
|

Updated on: Mar 26, 2026 | 11:32 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, తోటి విద్యార్థుల అశ్లీల చిత్రాలను సృష్టించిన ఇద్దరు టీనేజ్ బాలురకు కోర్టు కఠినశిక్ష విధించింది. ఆ చిత్రాలు తమపై కలిగించిన మానసిక క్షోభకు గురి చేశాయంటూ బాధితుల ఫిర్యాదు మేరకు ప్రొబేషన్ విధించినట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. టిపెన్సిల్వేనియాలోని లాంకాస్టర్‌లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఇద్దరు టీనేజ్ బాలురు, తమ తోటి విద్యార్థుల అశ్లీల చిత్రాలను సృష్టించడానికి కృత్రిమ మేధను ఉపయోగించినట్లు అంగీకరించారు. దీంతో బుధవారం (మార్చి 25) రోజున ఆ ఇద్దరు విద్యార్థులు ప్రొబేషన్‌కు గురయ్యారని పోలీసలు తెలిపారు.

14 ఏళ్ల వయసున్న ఇద్దరు కుర్రాళ్లు, 59 మంది బాలికలతో పాటు సుమారు 350 చిత్రాలను తీసినట్లు అంగీకరించారు. 2023, 2024 సంవత్సరాల్లో బాలురు పాఠశాల ఫోటోలు, ఇయర్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌టైమ్ చాట్‌ల నుండి బాలికల చిత్రాలను తీసుకుని, వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశారని పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా సదరు స్కూల్ కు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోర్టుకు హాజరయ్యారు. పెన్సిల్వేనియాలో బాల నేరస్థుల విచారణలు సాధారణంగా రహస్యంగా జరుగుతాయి. కానీ దీనిని న్యాయమూర్తి బహిరంగపరిచారు. తద్వారా సమాజం తమను తాము చూపించుకోవడానికి, తమ గళాన్ని వినిపించడానికి ఒక అసాధారణ అవకాశం లభించింది. కోర్టు విచారణ సందర్భంగా, బాధితులు ఆ సంఘటన వల్ల కలిగిన తీవ్రమైన మానసిక వేదనను వివరించారు. ఆ చిత్రాల సృష్టించి షేర్ ద్వారా ఎంతో వేదనకు గురవుతున్నట్లు చాలా మంది బాలికలు అనుభవించిన బాధను కోర్టుకు తెలియజేశారు.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి కీలక తీర్పు వెలువరించారు. ప్రతి బాలుడు 60 గంటల సామాజిక సేవ చేయాలని, బాధితులను సంప్రదించకుండా ఉండాలని, నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి లియోనార్డ్ బ్రౌన్ ఆదేశించారు. ఒకవేళ నిందితులు పెద్దవారై ఉంటే, వారు బహుశా జైలు శిక్షను ఎదుర్కొనేవారని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవాన్ని ఆత్మపరిశీలన, ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలని బ్రౌన్ వారిని ప్రోత్సహించారు.

ఈ కేసు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీని ఫలితంగా నిరసనలు, పాఠశాల అధికారుల రాజీనామాలు జరిగాయి. పలువురు బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది నదీమ్ బెజార్, డీప్‌ఫేక్ చిత్రాల వ్యాప్తికి జవాబుదారీతనం కోరుతూ, పాఠశాల, ఇందులో పాలుపంచుకున్న ఇతరులపై దావా వేయనున్నట్లు ప్రకటించారు. హానికరమైన కంటెంట్‌ను సృష్టించడంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకంపై దేశవ్యాప్తంగా శాసనపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఏఐ సాంకేతికత ప్రాబల్యం రోజురోజుకు పెరుగుతున్నందున, డీప్‌ఫేక్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చట్టసభ సభ్యులు నిబంధనలను అమలు చేయడం ప్రారంభించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ‘టేక్ ఇట్ డౌన్ యాక్ట్’, సమ్మతి లేకుండా సన్నిహిత చిత్రాలను ప్రచురించడాన్ని నిషేధిస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి అటువంటి కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తుంది. ప్రస్తుతం, 46 రాష్ట్రాలు డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టాలను అమలు చేశాయి, మిగిలిన రాష్ట్రాల్లో చట్టాలు రావలసి ఉన్నాయి. ఇది ఏఐ-సృష్టించిన కంటెంట్‌తో ముడిపడి ఉన్న ప్రమాదాల పట్ల పెరుగుతున్న అవగాహనను స్పష్టం చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!