AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా..? బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే మ్యాజిక్‌ డ్రింక్‌ ఇది..!

మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో సొంపు ఒకటి. భోజనం చేసిన తర్వాత నోటి దుర్వాసన పోవడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి చాలామంది సొంపు నములుతుంటారు. అయితే, రోజూ ఉదయాన్నే పరగడుపున సొంపు నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహగ్రస్తులకు సొంపు నీరు చేసే మేలు, దాని ఉపయోగాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 04, 2026 | 1:22 PM

Share
మధుమేహం తో బాధపడుతున్న వారికి సొంపు నీరు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా తోడ్పడుతుంది. సొంపు గింజల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సొంపు నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మరిన్ని ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.

1 / 5
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్: సొంపు గింజలలో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

2 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: డయాబెటిస్ ఉన్నవారిలో జీర్ణసంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సొంపులో ఉండే ఈస్ట్రోగోల్, ఫెంచోన్, అనిథోల్ వంటి నూనె కాంపౌండ్లు జీర్ణరసాల స్రవాన్ని పెంచుతాయి. ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
బరువు తగ్గడానికి దోహదం: అధిక బరువు అనేది టైప్-2 డయాబెటిస్‌కు ప్రధాన కారణాలలో ఒకటి. సొంపు నీరు శరీరంలో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఇది ఆకలిని అదుపులో ఉంచి, శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు అదుపులో ఉంటే షుగర్ లెవెల్స్ కూడా త్వరగా అదుపులోకి వస్తాయి.

4 / 5
ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సొంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టుకుని తాగవచ్చు. లేదా రాత్రంతా నానబెట్టిన నీటిని నేరుగా కూడా తాగవచ్చు. అయితే, సొంపు నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, పరిమితికి మించి తాగకూడదు. అలాగే ప్రెగ్నెంట్ మహిళలు, ఇప్పటికే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం శ్రేయస్కరం.

5 / 5
Follow Us
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే

ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!

ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..

సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే

వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!

సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు

మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..

రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?

అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్