BBL 2026 : బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
BBL 2026 : ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్‌పై బిగ్ బాష్ లీగ్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. సిడ్నీ సిక్సర్స్, హోబార్ట్ హరికేన్స్ పోటీపడుతుండగా, స్టోక్స్‌కు దాదాపు 600,000 ఆస్ట్రేలియన్ డాలర్ల డీల్ దక్కే అవకాశం ఉంది. ఇది పూర్తయితే BBL చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

BBL 2026 : న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ ఓటమి అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జూన్ 2026లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న 35 ఏళ్ల ఈ లెజెండ్ ప్లేయర్, క్రికెట్‌కు పూర్తిగా దూరం కావడం లేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లు, ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో కొనసాగాలని నిశ్చయించుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించగానే నేరుగా కోచింగ్ లేదా కామెంట్రీ వైపు వెళ్లకుండా, యాక్టివ్ ప్లేయర్‌గానే మైదానంలో అడుగుపెట్టాలని ఆయన నిర్ణయించుకోవడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
బిగ్ బాష్ లీగ్‌లో రికార్డు ధర
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్(BBL)లో ఆడేందుకు బెన్ స్టోక్స్ విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కోడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. అనేక బీబీఎల్ ఫ్రాంచైజీలు ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇందులో 2026/27 సీజన్ కోసం బెన్ స్టోక్స్‌ను సైన్ చేసే రేసులో సిడ్నీ సిక్సర్స్ అందరికంటే ముందుంది. ఇంగ్లాండ్ మాజీ వైట్-బాల్ కోచ్ మాథ్యూ మోట్ ప్రస్తుతం సిడ్నీ సిక్సర్స్ జట్టుతో ఉండటం వారికొక పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌లోనే ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో 2022 టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆనాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో స్టోక్స్ నాటౌట్‌గా 52 రన్స్ చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచారు.
హోబార్ట్ హరికేన్స్ సైతం పోటీలోనే
బెన్ స్టోక్స్‌కు బిగ్ బాష్ లీగ్ కొత్తేమీ కాదు. ఆయన గతంలో 2014/15 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడి తన సత్తా చాటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిడ్నీ సిక్సర్స్‌తో పాటు హోబార్ట్ హరికేన్స్ కూడా స్టోక్స్‌ను దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. క్రికెట్ టాస్మానియా మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ను తమ జట్టు వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ తన హోమ్ కౌంటీ అయిన డర్హామ్ జట్టు తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రాణిస్తున్నారు.
బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా
ఈ భారీ డీల్ విలువ దాదాపు 600,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండవచ్చని సమాచారం. రాబోయే బీబీఎల్ సీజన్లలో కనీసం కొన్ని మ్యాచ్‌లకైనా స్టోక్స్ ఆడేలా ఒప్పందం కుదుర్చుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ డీల్ గనుక పూర్తయితే, బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యంత భారీ ధర పొందిన విదేశీ క్రికెటర్‌గా బెన్ స్టోక్స్ ఆల్-టైమ్ రికార్డు సృష్టిస్తారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
