AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్! ఎవరో గుర్తుపట్టారా?

Video: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో సూపర్‌బైక్‌పై దుమ్మురేపారు. 45 ఏళ్ల వయసులోనూ ఆయన స్పీడ్, ఫిట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇదే సమయంలో సీఎస్‌కేలో ధోనీ కొత్త బాధ్యతలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది.

Video: బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్! ఎవరో గుర్తుపట్టారా?
Ms Dhoni (2)
Rakesh
|

Updated on: Aug 04, 2026 | 2:46 PM

Share

Video: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన డిఫరెంట్ స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ, ధోనీకి బైక్‌లు, కార్లపై ఉన్న పిచ్చి, క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. సోమవారం రోజున చెన్నై సమీపంలోని ఇరుంగట్టుకోటైలో ఉన్న మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‎లో ఆయన పవర్‌ఫుల్ సూపర్‌బైక్‌ను నడిపి అభిమానులను మైమరిపించారు. ఒక ప్రముఖ టైర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అక్కడకు వచ్చిన ధోనీ, హై-పెర్ఫార్మెన్స్ సూపర్‌బైక్‌పై విపరీతమైన వేగంతో పలు ల్యాప్‌లను దిగ్విజయంగా పూర్తి చేశారు. ట్రాక్‌పై ఆయన బైక్ కంట్రోల్, కాన్ఫిడెన్స్ చూసి అక్కడున్న రేసర్లు, ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు.

హెల్మెట్ తీయగానే హోరెత్తిపోయిన ప్లాట్‌ఫామ్

బైక్ రైడింగ్ పూర్తి చేసుకుని ధోనీ పిట్ లేన్‌లోకి రాగానే ఫొటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టారు. హెల్మెట్ తీసి వేసి అభిమానులకు చేతులూపుతూ అభివాదం చేయడంతో ఆ ప్రాంతమంతా ఈలలు, కేరింతలతో హోరెత్తిపోయింది. 45 ఏళ్ల వయసులోనూ ధోనీ చూపుతున్న ఫిట్‌నెస్, చురుకుదనం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ధోనీకి మోటార్ సైకిళ్లపై ఉన్న మక్కువ చాలా పాతది. ఆయన గ్యారేజీలో ఎన్నో లగ్జరీ, వింటేజ్ బైక్‌ల అరుదైన కలెక్షన్ ఉంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తనకిష్టమైన బైక్‌లపై లాంగ్ రైడ్స్ వెళ్లడం ధోనీకి అలవాటు.

సీఎస్‌కేకి కొత్త కోచ్‌గా ధోనీ?

ధోనీకి తమిళనాడు, ముఖ్యంగా చెన్నై నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆయన ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2027లో ధోనీ మళ్లీ యల్లో జెర్సీలో కనిపిస్తారా లేదా అనే చర్చలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇటీవల దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమ్‌ను విడిచిపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో భవిష్యత్తులో ధోనీయే సీఎస్‌కే జట్టుకు హెడ్ కోచ్‌గా లేదా క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా బాధ్యతలు చేపడతారని గట్టిగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!