AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-–2026లో క్వాలిఫై అయిన..

తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు
Telangana NEET Counselling
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 2:59 PM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్ 4: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-–2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్‌లోడ్ చేయాలి.
  • నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
  • సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
  • అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను KNRUHS వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  • వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!