నాటుకోడి టమాటో చారు..ఇలా చేస్తే తినడమే కాదు తాగేస్తారు కూడా
Prasanna Yadla
25 March 2026
Pic credit - Pixabay
నాటుకోడి టమాటో చారు ఎప్పుడైనా విన్నారా? చేసి తింటే రుచి అదిరిపోతోంది.
నాటుకోడి టమాటో చారు
మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
నాటుకోడి టమాటో చారు
మీరు ముందుగా నాటుకోడి ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి అర టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి మళ్ళీ శుభ్ర పరచాలి.
స్టెప్ -1
ఆ తర్వాత టమాటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి.
స్టెప్ -2
ఇప్పుడు కుక్కర్‌లో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించి పెట్టుకోవాలి.
స్టెప్ -3
ఇప్పుడు పాన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి.
స్టెప్ -4
కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి.ఆ తర్వాత నాటుకోడి ముక్కలు, టమాటా పేస్ట్ సాలా పొడులు వేసి బాగా ఉడికించాలి.
స్టెప్ -5
దానిలోరెండు గ్లాస్ ల నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర, కరివేపాకు ఆకులు వేస్తే రుచి అదిరిపోతోంది.