పసందైన పనస తొనలతో నవ యవ్వనం మీ సొంతం

26 March 2026

TV9 Telugu

TV9 Telugu

పనసపండుతో మరేదీ సాటి రాదు కదూ! మరే పండుకూ లేనంత చక్కటి పరిమళం, ఆ రుచీ తింటుంటే పసందుగా ఉంటాయి. అంతేనా ఆ వాసన పీలిస్తేనే కడుపు నిండినట్లుంటుంది

TV9 Telugu

పనస రుచిలో అమృతం.. పోషకాలు అమూల్యంగా ఉంటాయి.  పనసతొనలు తినటం వల్ల శరీరానికి మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, పీచు, రిబోఫ్లేవిన్, ఎ, సి విటమిన్లు విస్తారంగా అందుతాయి

TV9 Telugu

పనసపండులో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. పనసలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది

TV9 Telugu

దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. పనసలో ఉండే పీచుపదార్థం, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు వివిధ గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయి

TV9 Telugu

పనసపండులో అనేక రకాల ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇందులో రక్తపోటును తగ్గించే, క్యాన్సర్‌ను నిరోధించే, అల్సర్‌ను నిరోధించే, వృద్ధాప్యాన్ని నివారించే గుణాలు కూడా పనసలో ఉన్నాయి

TV9 Telugu

పనసపండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రెండు పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. అయితే పనస పండును అధికంగా తినడం వల్ల అజీర్ణం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఎల్లప్పుడూ మితంగా తినాలి

TV9 Telugu

రక్తహీనత నుంచి బయటపడొచ్చు. వెంటనే శక్తి లభిస్తుంది, నీరసం, నిస్సత్తువ మాయమవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగవుతుంది. ఊబకాయం రాదు. మానసిక ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ఉల్లాసం, ఉత్సాహం సొంతమవుతాయి

TV9 Telugu

కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి. రక్తపోటు తదితర సమస్యలను అరికట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలకు పటుత్వం వస్తుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎముకలు గుల్లబారడాన్ని అరికడతాయి