రొయ్యల కూర ఇలా వండితే.. ఆపకుండా గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు

Prasanna Yadla

25 March 2026

Pic credit - Pixabay

రొయ్యలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు కూడా చెబుతున్నారు

రొయ్యలు 

వీటితో ఇలా కూర చేసి తింటే ఆ రుచే వేరబ్బా.. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

రొయ్యల కూర 

అర కిలో రొయ్యలు, 4 ఉల్లిపాయలు, రెండు పండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి

కావాల్సిన పదార్దాలు

అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, మసాలా పొడి , ఉప్పు, నూనెను , కొత్తిమీరను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు 

మీరు ముందుగా రొయ్యలను తీసుకుని నీటిలో కడిగి వాటిని పక్కన పెట్టుకోవాలి. 

స్టెప్ -1 

పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.

స్టెప్ -2

ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలు , అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, మసాలా పొడులు వేసి బాగా కలుపుకోవాలి. 

స్టెప్ -3

ఇప్పుడు రొయ్యలు కూడా వేసి వేయించాలి రెండు గ్లాస్ ల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.అంతే, వేడి వేడి రొయ్యల కూర రెడీ 

అంతే, వేడి వేడి రొయ్యల కూర రెడీ