AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు భయ్యా.! ఐపీఎల్‌లో డేంజరస్ జట్టు ఇదే.. అందరూ అవెంజర్సే

మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకారం.. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలవనుంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కీలక ఆటగాళ్ల కలయికతో ఈ జట్టుకు ఎలాంటి బలహీనతలు లేవని ఆయన అన్నారు. చరిత్రలో ఐదు ట్రోఫీలు గెలిచిన ముంబై, ఈసారి మరింత పటిష్టంగా కనిపిస్తోందన్నారు.

IPL 2026: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు భయ్యా.! ఐపీఎల్‌లో డేంజరస్ జట్టు ఇదే.. అందరూ అవెంజర్సే
Ipl 2026
Ravi Kiran
|

Updated on: Mar 26, 2026 | 11:59 AM

Share

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు, ముంబై ఇండియన్స్ జట్టు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ముంబై ఇండియన్స్‌ను అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అభివర్ణించారు. జట్టుకు ఎలాంటి బలహీనతలు లేవని, టోర్నీ ఆరంభానికి ముందే అది మరింత దుర్భేద్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు, వివిధ కాంబినేషన్‌లు, క్లచ్ ప్లేయర్‌లతో ముంబై ఇండియన్స్ అన్ని విధాలుగా శక్తివంతంగా ఉందని చోప్రా హైలైట్ చేశారు.

ముంబై ఇండియన్స్ గత ప్రదర్శనలను పరిశీలిస్తే.. గత ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుకున్నారు. జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వీరితో పాటు, ట్రేడింగ్, మినీ వేలం ద్వారా జట్టు తమ బలాన్ని మరింత పెంచుకుంది. రూథర్ ఫోర్డ్, మయాంక్ మార్కండే, శార్దూల్ ఠాకూర్ లాంటి కీలక ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకున్నారు. ఈ కొత్త చేరికలతో, ఇప్పటికే పటిష్టంగా ఉన్న జట్టు మరింత శక్తివంతంగా మారిందని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు.

ముంబై ఇండియన్స్ చారిత్రక విజయాలు వారి బలానికి నిదర్శనం. వారు ఐపీఎల్‌లో 11 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించారు. ఆరుసార్లు ఫైనల్స్ ఆడి, రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలను గెలుచుకున్నారు. ఈ అద్భుతమైన ఘనతలు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు మాత్రమే సాధ్యమయ్యాయి. ఈసారి జట్టు కూర్పును బట్టి చూస్తే, ప్రత్యర్థి జట్లకు ఈ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోవడం కష్టమేనని చోప్రా అభిప్రాయపడ్డారు. ఆకాశ్ చోప్రా ముంబై ఇండియన్స్ జట్టును “అవెంజర్స్” జట్టుతో పోల్చారు, ప్రతి ఒక్క ఆటగాడికి ఒక సూపర్ పవర్ ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్ జట్టులో ఉండటం ముంబైకి పెద్ద అదనపు బలం. స్వింగ్ బౌలర్లైన ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్.. స్పిన్నర్లైన మిచెల్ శాట్నర్, గజన్ఫార్ లాంటివారు జట్టుకు లభ్యం కావడం బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసింది. ఓపెనింగ్ స్థానాల కోసం క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్‌లలో ఒకరిని, మిడిల్ ఆర్డర్ కోసం విల్ జాక్స్, షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్‌లలో ఒకరిని ముంబై ఇండియన్స్ ఆడించగలదని ఆయన పేర్కొన్నారు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌