AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి వింత! ముళ్ల కాళ్లపై నిలిచే అరుదైన చేప

Tripod fish: సముద్రంలో విభిన్న రకాల జాతుల చేపలు ఉంటాయి. కొన్ని చేపలు మాత్రమే మత్స్యకారులకు చిక్కుతుంటాయి. తాజాగా సాగర్ నగర్ సముద్రతీరంలో మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయి. వాటిలో ఒకటి చుక్కల టేకు చేప, మరొకటి ట్రైపాడ్ ఫిష్ (ముళ్ల భవిరి చేప). ఇది చాలా అరుదుగా కనిపించే చేప.

ప్రకృతి వింత! ముళ్ల కాళ్లపై నిలిచే అరుదైన చేప
Fish
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 26, 2026 | 10:28 AM

Share

సముద్రంలో రకరకాల జలచరాలు ఉంటాయి. వాటిలో చేపలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. జల పుష్పాల్లోనూ రకరకాల జాతులు సముద్ర జలాల్లో సంచరిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని రకాలు మాత్రమే సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు చిక్కుతూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకున్న వాటికంటే పెద్ద చేపలు చిక్కితే మత్స్యకారులు సంబరపడిపోవడం సహజం. కానీ మరికొన్నిసార్లు.. వివిధ రూపాల్లో వింత వింత చేపలు వలల్లో ఆ మత్స్యకారులకు కూడా ఆనందం ఆశ్చర్యం కూడా కలుగుతుంది. తాజాగా సాగర్ నగర్ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయ్. వాటిలో ఒకటి చుక్కల టేకు చేప కాగా.. మరొకటి ట్రైపాడ్ ఫిష్. దీన్నే ముళ్ల భవిరి చేప అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా కనిపించే చేప.

ఈ చేప చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణ చేపల కంటే కాస్త వెరైటీగా దాని వ్యవహార శైలి కూడా ఉంటుంది. శరీరాకృతిలో ప్రత్యేకంగా ఉండే.. ముళ్ళతో కూడిన రెక్కలు ఆ చేప ప్రత్యేకత. అది కూడా పొడవాటి కాళ్ల మాదిరిగా.. ఆ రెక్కలు ఉంటాయి. ఆ చేప ఎక్కడైనా సేద తీరెందుకైనా, ఆహారం కోసం వేటాడేందుకైనా.. తన సహజత్వాన్ని అనుకూలంగా మలుచుకుంటుంది. కడుపు కింద భాగంలో ఉన్న రెక్కలను.. పొడవాటి కాళ్ల మాదిరిగా ఉపయోగించుకుంటుంది. ముందువైపు బోర్లించిన వి ఆకారంలో రెండు రెక్కలకు పదునైన ముళ్ళు సాయంతో వాటిని నిటారుగా పెట్టి నిల్చుంటుంది. అలాగే తోక వైపు మరో రెక్క కూడా ఈ చేప జాతికి ఉంటుంది. వీటి సాయంతో.. సముద్రపు అడుగు భాగంలో నేలపై నిలబడడానికి.. ఆహారాన్ని అన్వేషించేందుకు ఈ రెక్కలు వాటికి కాళ్లలా ఉపయోగపడతాయి. ఒక ప్రాంతంలో కదలకుండా నిలబడి.. శరీరంపై ఉన్న మరిన్ని సున్నితమైన రెక్కలతో నీటిలోని చిన్న చిన్న జీవుల్లో కదలికలను గమనించి వేటాడుతాయి. సాధారణంగా ఇదే సమయంలో తన కడుపు కింది భాగంలో ఉన్న రెక్కలను వెనక్కి ముడుచుకొని ముందుకు సాగుతూ ఉంటుంది ఆ చేప.

తమ పొడవైన కింది రెక్కలను.. ఒక స్టాండ్‌లా వినియోగించి నిలుచుంటుంది ఈ చేప. అందుకే దీన్ని ట్రైపాడ్ ఫిష్ (Tripod fish) అని కూడా అంటారు. ఈ చేపలు సుమారు 30 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కడుపు కింది భాగంతో పాటు మరికొన్ని జాతుల్లో వీపు పైన కూడా కొన్ని రెక్కలు.. రక్షణ కోసం ఈ చేపలు వాటిని వినియోగిస్తుంటాయి. ఇవి సముద్రపు లోతైన ప్రాంతాల్లోని అడుగు భాగంలో నివసించే ఆసక్తికరమైన అరుదైన చేప ఇది.

మరోవైపు, స్పాటెడ్ ఈగల్ రే అనే టేకు చాప కూడా మత్స్యకారుల వరకు చిక్కింది. పొడవాటి తోక నల్లటి గాలిపటంలా ఉన్న ఈ టేకు చేప శరీరంపై తెల్లని చుక్కలు కలిగి ఉంది. దీని పొడవాటి తోక శత్రువుల నుంచి రక్షణ కోసం వినియోగిస్తూ ఉంటుంది. గాలిలో పక్షి ఎగిరే మాదిరిగా నీటిలో ఈదుతుంది ఈ చేప. తీర ప్రాంతంలో చాలా అరుదుగా కనిపించే ఈ చేపలను ఆసక్తిగా తిలకించారు.

Follow Us