AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమ్మయ్య.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించడంతో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హమ్మయ్య.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2026 | 3:58 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుండంగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణంపై వెదర్ డిపార్ట్‌మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది.. ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

రాయలసీమ :-

గమనిక ;- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పు లేదు.

Follow Us