AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు ఎన్టీఆర్ సినిమాలో సైడ్ రోల్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ..

టాలీవుడ్‌లో నందమూరి కుటుంబ వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ సెపరేట్ ప్యాన్ బేస్ సెట్ చేసుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సినిమాలే కాదు, స్మాల్ స్క్రీన్‌పై కూడా తన ప్రత్యేక ముద్ర వేసిన నటుడు ఆయన. తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ అనే రియాలిటీ షోను మొదటగా పరిచయం చేసి, తనదైన స్టైల్లో సూపర్ హిట్‌గా మార్చారు.

అప్పుడు ఎన్టీఆర్ సినిమాలో సైడ్ రోల్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ..
Ntr
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2025 | 9:34 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్టీఆర్.  దేవర లాంటి విజయం తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ 2 ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలాగే దేవర 2లోనూ నటించనున్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఊసరవెల్లి సినిమా ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద సంగీతం అందించారు. ఊసరవెల్లి సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో తమన్నా స్నేహితురాలిగా నటించిన ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు పాయల్ గోష్. ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆతరువాత తెలుగులో తక్కువ సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది ఈ అమ్మడు.

ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాతో పాటు మిస్టర్ రాస్కల్ అనే సినిమాలోనూ నటించింది ఈ భామ. ఇక పాయల్ ఘోష్.. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ అమ్మడు లైంగిక వేధింపుల నేపథ్యంలో అనురాగ్ కశ్యప్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. అనురాగ్ తనను లైంగికంగా వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 26 అక్టోబర్ 2020న ఆమె రాందాస్ అథవాలే రాజకీయ పార్టీలో చేరింది. ఇక పాయల్ ఘోష్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ అమ్మడు అప్పట్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కాంట్రవర్సీ క్వీన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.