AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ది సినిమాలో చిరంజీవి హీరోయిన్.. కీలక పాత్రలో కనిపించనున్న ఆ బ్యూటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఈ సాంగే వినిపిస్తుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది

పెద్ది సినిమాలో చిరంజీవి హీరోయిన్.. కీలక పాత్రలో కనిపించనున్న ఆ బ్యూటీ
Peddi
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2025 | 8:42 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత వస్తున్న సినిమాకావడంతో మెగా అభిమానులంతా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు పెద్ది సినిమా పై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు దర్శకుడు బుచ్చి బాబు సాన. తొలి సినిమాతోనే వందకోట్లు రాబట్టిన బుచ్చి బాబు.. ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో చరణ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్, వీడియో గ్లింప్స్ సినిమా పై హైప్ ను భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన చిక్కిరి చిక్కిరి సాంగ్ సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే 60 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఓ సీనియార్ హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.  పెద్ది సినిమాను మార్చ్ 27న విడుదలకానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచేందుకు ఒకొక్క క్యారెక్టర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివన్న నటిస్తున్నాడని తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ కూడా కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ శోభన. ఈ సీనియర్ హీరోయిన్ చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అలాగే చిరంజీవితో కలిసి నటించారు శోభన. రుద్రవీణ, రౌడీ అల్లుడు సినిమాల్లో చిరు , శోభన కలిసి నటించారు. ఇక ఇప్పుడు ఆమె పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. అలాగే ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శోభన. కల్కి సినిమాలో నటించారు. అలాగే మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేశారు. ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో కనిపించనున్నారని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.