ఇన్‌స్టాగ్రామ్ పుణ్యమా అని హీరోయిన్ అయ్యింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీగా
సినిమా ఇండస్ట్రీలో కురాళ్ళ కవ్వించే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అందచందాలతో పాటు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కుర్రహీరోయిన్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు.

సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్నో ఏళ్లు పడుతుంది సినిమాల్లో ఛాన్స్ రావడానికి.. కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి ఇట్టే హీరోయిన్స్ అవుతూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది హీరోయిన్స్ గా మారుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి చాలా మంది వచ్చారు. ఇక ఈ అమ్మడి విషయానికొస్తే ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేసి పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీ తోనే ఇప్పుడు హీరోయిన్ గా మారింది. ఏకంగా స్టార్ డైరెక్టర్ ఆమెతో సినిమా చేస్తున్నారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఇన్ స్టా రీల్స్ చేసిన సమయంలో చీరకట్టులో పద్దతిగా కనిపించి వావ్ అనిపించింది.. కానీ ఒక్కసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అంతే గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అందరూ అవాక్ అయ్యేలా చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే.. శ్రీలక్ష్మీ సతీష్. ఈ పేరు ప్రేక్షకులకు అసలు పరిచయం కూడా లేదు. అదే ఆరాధ్య దేవి అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు.
చీరకట్టులో ఫోటోస్ షేర్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శారీ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ తెగ వైరలయ్యాయి. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 22 ఏళ్ల వయసులో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని అనుకున్నానని.. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. త్వరలోనే శారీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.