Ram Charan: స్పీడ్ పెంచిన రామ్ చరణ్ పెద్ది టీమ్.. వీడియో గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..
ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత చరణ్ ఆర్సీ 16 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అందరిలో ఆసక్తిని పెంచుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేశారు. దీంతో అందరిలో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇందులో రామ్ చరణ్ రా, రగ్డ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్ అవతార్‌ని చూసి అందరూ అభినందించారు. ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, అంచనాలను మరో మెట్టుకు తీసుకెళ్లేలా పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ‘ఫస్ట్ షాట్’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుదలవుతుంది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో క్రీడా మైదానంలోకి డైనమిక్‌గా దూకుతోన్న రామ్ చరణ్‌ను చూడొచ్చు. ఈ పోస్టర్‌తో గ్లింప్స్ ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ‘పెద్ది’ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని ఎవరూ ఊహించని రీతిలో అన్‌కాంప్రమైజ్డ్‌గా వృద్ధి సినమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సినిమాను చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ సూపర్‌స్టార్ కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అకాడమీ అవార్డు గ్రహీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌ను ఆర్. రత్నవేలు ఐఎస్‌సి అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను అందిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. అప్పటి వరకు ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా పెద్ది చిత్రం నుంచి విడుదల కానున్న ఫస్ట్ షాట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడండి.
#PeddiFirstShot – Glimpse video out on 6th April on the occasion of Sri Rama Navami ❤️🔥
Wishing you a very Happy Ugadi ✨#Peddi 🔥
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas… pic.twitter.com/JBsv5ugWgF
— BuchiBabuSana (@BuchiBabuSana) March 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.