AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: ఏం తింటున్నావ్ అన్న..!! అజిత్ నయా లుక్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తమిళనాట ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు.

Ajith Kumar: ఏం తింటున్నావ్ అన్న..!! అజిత్ నయా లుక్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
Ajith
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2025 | 7:14 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీస్ కోసం ఇటు తెలుగు ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొన్నాళ్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈహీరో. గతేడాది తెగింపు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇటీవలే విడాముయార్చి సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష మరోసారి అజిత్ సరసన జత కట్టింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎంతవాడు గానీ సినిమా సూపర్ హిట్ కాగా.. చాలా కాలం తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో కన్నడ హీరో అర్జున్ విలన్ పాత్రలో కనిపించగా.. హీరోయిన్ రెజీనా కీలకపాత్ర పోషించింది. తమిళంలో విడాముయార్చి పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అజిత్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా దర్శకుడు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అజిత్ కొత్త లుక్ ను విడుదల చేశాడు. ఆ ఫోటోలో, అజిత్ క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఉన్నట్లుగానే ఉన్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫోటో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎవర్ గ్రీన్ అజిత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం మంచి ఆదరణ పొంది విజయం సాధిస్తుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..