వర్కౌట్ చేస్తూ గాయపడ్డ స్టార్ హీరోయిన్.. కోలుకోవడానికి ఇంకో 6 నెలలు..
చాలా మంది హీరోయిన్స్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తూ జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు.. ఈక్రమంలో కొంతమంది గాయపడుతూ ఉంటారు. ఇటీవలే రష్మిక మందన్న జిమ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా జిమ్ లో గాయపడింది..

చాలా మంది హీరోలు షూటింగ్స్ లో గాయపడటం మనం చూస్తూ ఉంటాం. దాదాపు అందరు హీరోలు షూటింగ్స్ లో ఊహించని ప్రమాదాల్లో గాయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే.. కాలికి గాయం అవ్వడంతో రష్మిక వీల్ చైర్ లో తిరగడం మనం చూశాం.. తాజాగా మరో హీరోయిన్ కూడా జిమ్ లో గాయపడిందని తెలుస్తుంది. ఆమె కోలుకోవడానికి ఇంకా ఆరునెలలు పడతాయని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? మొన్నటి వరకు టాలీవుడ్ లో తోపు హీరోయిన్ ఆమె.. ఆమె ఎవరంటే..
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ 2024 అక్టోబర్‌లో జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుకు గాయమైంది. ఆమె 80 కిలోల బరువును డెడ్‌లిఫ్ట్ చేసే సమయంలో ఈ గాయం అయ్యింది. ఆ సమయంలో వెన్నునొప్పి ఉన్నప్పటికీ, దాన్ని పట్టించుకోకుండా వ్యాయామం కొనసాగించడంతో ఆ గాయం కాస్త తీవ్రమైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు, కామెంట్స్ చేస్తున్నారు. గాయం కారణంగా ఆమె ఆరు రోజుల పాటు బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టవచ్చని తెలిపింది.
తాజా గా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను ఇప్పుడు కొద్దికొద్దిగా కోలుకుంటున్నానని, కానీ గాయం నుంచి పూర్తిగా బయటపడలేదని తెలిపింది. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవడం ముఖ్యమని, తాను చేసిన తప్పును ఇతరులు చేయవద్దని సలహా ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె తన తదుపరి సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది, అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక రకుల్ తెలుగులో సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
View this post on Instagram
రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి