నా వయసు 20 అయితే ఆ పని చేసేదాన్ని.. కానీ ఇప్పుడు చేయిదాటి పోయింది.. నటి కామెంట్స్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా.. సినిమాలతో బిజీగా ఉన్నారు. కొంతమంది పెళ్లి, ప్రేమ అంటూ అభిమానులను ఖుష్ చేస్తున్నారు. అలాగే కొంతమంది విడాకులు తీసుకొని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. గత ఏడాది చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి పీటలెక్కారు. అలాగే కొంతమంది విడాకులు కూడా తీసుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఉన్న చాలా మంది ఊహించని విధంగా విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. మరికొంతమంది మాత్రం పెళ్లి ఊసేలేకుండా సైలెంట్ గా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. 40, 50ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకొని వారు చాలా మంది ఉన్నారు. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోకుండా కూడా చాలామంది ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ నటి పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లితో పనేంటి అన్ని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..
సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో నటి ప్రగతి ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సీనియర్ నటి. ప్రగతి ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. ప్రగతి కేవలం నటి మాత్రమే కాదు. 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సాధించింది.
ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!
తాజాగా ఆమె మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో తెలుగు, తమిళ, మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించారు ప్రగతి. ఈ క్రమంలో ప్రగతికి పెళ్లి కావడంతో మూడేళ్ల పాటు నటనకు దూరమయ్యారు. ఆ తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశారు. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో పెళ్లి చేసుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం జీవితంలో అతిపెద్ద పొరపాటని తెలిపింది. అలాగే పెళ్లి, తోడు ముఖ్యమేనని కానీ నా మెచ్యూరిటీ లెవల్‌కు సరైన వ్యక్తి దొరక్కుంటే మళ్లీ కష్టమేనంటూ.. పెళ్లయ్యాక నువ్వు ఇలాగే ఉండు, ఇలా చేయ్ అంటూ కట్టిపడేస్తే నేను తట్టుకోలేను ప్రగతి తెలిపారు. ఒకవేళ నా వయసు 20 ఏళ్లు ఉంటే ఆలోచించే దాన్నని , కానీ నా చేయి దాటిపోయింది. కానీ సొసైటీకి మాత్రం మంచి పిల్లలను ఇచ్చానని.. ఆ విషయంలో గర్వంగా ఫీలవుతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








