AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం..! 8 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్ అందుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

సినిమా ఇండస్ట్రీ అనేది అందరికి ఒకేలా ఉండదు.. ఎంత టాలెంట్ ఉన్నా.. అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం కలిసి రాక సినిమాలకు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రం చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఈ అమ్మడు కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.

అయ్యో పాపం..! 8 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్ అందుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2025 | 9:01 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. దాంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.? తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా. అందంలో ఈ అమ్మడు అప్సరస.. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఇంతకూ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.

ప్రణీత సుభాష్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్