Nirmalamma: దివంగత నటి నిర్మలమ్మ గుర్తుందా? ఆమె మనవడు కూడా తెలుగులో హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
తెలుగు సినిమాల్లో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 1000కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారామె. కాగా చనిపోయే వరకు కూడా సినిమాల్లో నటించిన నిర్మలమ్మ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం ఆమె స్వస్థలం. 1920వ సంవత్సరం జూలై 18న గంగయ్య, కోటమ్మ దంపతులకు నిర్మల్మ జన్మించింది. చిన్ననాటినుంచి ఆమెకు నాటకాలంటే ఇష్టం. అదే తనను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. నిర్మలమ్మ మొదట హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది. అయితే ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో.. వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎన్టీఆర్ మొదలు మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు నిర్మలమ్మ. ముఖ్యంగా బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారామె. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో సుమారు 1000కి పైగా సినిమాలు చేసిన ఘనత ఈ నటి సొంతం. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాలో చివరిగా కనిపించిన నిర్మలమ్మ 2009 ఫిబ్రవరి 19 న కన్నుమూశారు.
కాగా నిర్మలమ్మ సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ ఆమె వ్యక్తిగత గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిర్మలమ్మ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావు ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు పుట్టలేదు. సంతానం కలగలేదనే బాధతో ఒకానొక దశలో నిర్మలమ్మ దంపతులు మానసికంగా కుంగిపోయారు. అయితే చివరకు ఓ పాపను దత్తత్తు తీసుకుని పెంచుకున్నారు. చదువు చెప్పించి పెద్ద చేసి దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఆమె పేరు కవిత.
పెళ్లి కాగానే కవిత కూడా విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు విజయ్ మాదాల. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పుట్టి పెరిగాడు. విజయ్ మాదాల కూడా ఒక సినిమాలో నటించాడు. ఆ సినిమా ఏంటో తెలుసా? పడమటి సంధ్యారాగం. జంధ్యాల తెరకెక్కించిన ఈ ఆంగ్లో ఇండియన్ లవ్ స్టోరీలో విజయ శాంతి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తరువాత మరో సినిమా చేయలేదు విజయ్ మాదాల. అతను చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉండటం వల్ల తెలుగు సరిగ్గా మాట్లాడటం రాక బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మరే తెలుగు సినిమాలో కనిపించలేదు విజయ్ మాదాల.

Nirmalamma 1
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








