Actress Anshu: అరే.. అన్షు తలకు ఏమైంది? గాయంతోనే మజాకా ఈవెంట్‌కు మన్మథుడు హీరోయిన్.. ఫొటోస్ వైరల్
కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలు చేసినా ఆడియెన్స్ కు బాగా గుర్తుండి పోతారు. అందులో అన్షు కూడా ఒకరు. సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైందీ అందాల తార. తన అందం, అభినయం, అమయాకత్వపు చూపులతో అందరినీ కట్టిపడేసింది.

సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది అన్షు. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీలోనూ హీరోయిన్ గా నటించింది. అయతే ఏమైందో ఏమో తెలియదు కానీ మరే మూవీలోనూ కనిపించలేదీ అందాల తార. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి పోయి పెళ్లి చేసుకుని విదేశాల్లోనే సెటిల్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సుమారు 20 ఏళ్ల తర్వాత ‘మజాకా’తో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ధమాకా ఫేం నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోయిన్లు గా నటించారు. అలాగే అన్షు, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న మజాకా సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 23) హైదరాబాద్ లో మజాకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్లతో సహా చిత్ర బృందమంతా హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో నటి అన్షు తలకు బ్యాండేజ్‌తో కనిపించారు. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా.? అని అందరూ ఆరా తీస్తున్నారు. సెట్‌లో ఏమైనా గాయమయ్యిందా? లేక ఇంట్లోనే దెబ్బ తగిలిందా. అని చర్చించుకుంటున్నారు.
కాగా తన గాయంపై అన్షు ఇంకా స్పందించాల్సి ఉంది.అయితే గాయంతోనే అన్షు సినిమా ఈవెంట్ కు హాజరవ్వడంపై అభిమానులు ప్రశంసిస్తున్నారు. సినిమాపై అమెకున్న డెడికేషన్ అదుర్స్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మజాకా సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.
మజాకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అన్షు..
Happy smiles and electrifying energy at the #Mazaka Trailer Launch Event✨
Here are a few pictures capturing the excitement 📸
Celebrate this Shivaratri with MAZAKA – IN THEATERS FROM FEBRUARY 26th📽@sundeepkishan @riturv #RaoRamesh @AnshuActress… pic.twitter.com/r6SJlvWcPp
— AK Entertainments (@AKentsOfficial) February 23, 2025
కుటుంబ సభ్యులతో అన్షు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








