AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బావమరదల్లు ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్.. ఎవరో కనిపెట్టండి..

పైన ఫోటోను చూశారు కదా.. బోసి నవ్వులు చిందిస్తోన్న ఈ ఇద్దరు చిన్నారు ఇప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోహీరోయిన్స్. ఇద్దరూ మొదటి సినిమాతోనే నటనపరంగా మంచి మార్కులు కొట్టేశారు.

Tollywood: ఈ బావమరదల్లు ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్.. ఎవరో కనిపెట్టండి..
Actors
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2023 | 11:10 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో త్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. సామాన్యుల నుంచి స్టార్ హీరోహీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్ననాటి పిక్ నెట్టింటిని షేక్ చేసింది. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా టాలీవుడ్ టూ బాలీవుడ్ తారల పిక్స్ తెగ చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఓ బావమరదల్ల ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. బోసి నవ్వులు చిందిస్తోన్న ఈ ఇద్దరు చిన్నారు ఇప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోహీరోయిన్స్. ఇద్దరూ మొదటి సినిమాతోనే నటనపరంగా మంచి మార్కులు కొట్టేశారు. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎవరో గుర్తుపట్టండి. వీరిద్దరు సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. మావయ్య.. బాబాయ్.. సోదరులు ఇలా అందరూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కలిగినవారే. ఎవరో కనిపెట్టండి.

ఆ ఇద్దరు చిన్నారులు మరెవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. అలాగే.. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక. ముందుగా నిహారిక.. యాంకర్ గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత ఒక మనసు సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యింది. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ఎంచుకుంటూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది నిహా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ.. నిర్మాణ రంగంలో రాణిస్తోంది. ఇటీవలే హాలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ నిర్మించి సకెస్స్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇక పంజా వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే.. టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమాతో అలరించారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు వైష్ణవ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.