Drushyam: దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు ఇప్పుడెలా ఉందో తెలుసా.. హీరోయిన్స్‌ను మించిపోయే అందం..
దృశ్యం చిత్రంలో వెంకీ చిన్న కూతురిగా కనిపించిన ఎస్తర్ అనిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమాయకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
విక్టరీ వెంకటేష్.. మీనా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల వచ్చిన ఈ సినిమా సీక్వెల్ సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో వెంకీ చిన్న కూతురిగా కనిపించిన ఎస్తర్ అనిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమాయకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ చిత్రం 2014లో విడుదలైన సమయంలో తన వయసు 13 ఏళ్లు. ఆ వయసులోనే తన నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక 2021లో వచ్చిన దృశ్యం సీక్వెల్ లోనూ కనిపించింది. ఈ సినిమా సమయానికి హీరోయిన్లా మారిపోయింది. ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ఇక తెలుగులో జోహార్ అనే వెబ్ మూవీలో ఎస్తర్ హీరోయిన్ గా నటిచింది. ఓవైపు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఎస్తర్.
ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఎస్తర్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమె షేర్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి. అంతేకాకుండా.. లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ప్రస్తుతం ఎస్తర్ తెలుగులో హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేస్తుంది.
ఇప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఎస్తర్ .. ఇప్పుడు కథానాయికగా మారేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మాడి వయసు 21. వాస్తవానికి ఎస్తర్ కేరళ కుట్టి. మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఎస్తర్ పొట్టి పొట్టి దుస్తుల్లో దిగిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయేమో..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.