Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో తెలుసా ?..

కొన్నాళ్లుగా తారల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో మహేష్ బాబు పక్కనే ఎంతో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా ?.. హీరోయిన్ అనుకుంటే మాత్రం పొరపాటే. ఆ అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరో సతీమణి. ఇంతకీ ఎవరంటే.. మహేష్ బాబు పక్కనే కనిపిస్తున్న ఆ అమ్మాయి

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో తెలుసా ?..
Mahesh Babu
Follow us

|

Updated on: Apr 27, 2024 | 10:23 AM

సోషల్ మీడియాలో చాలాకాలంగా స్టార్ హీరోహీరోయిన్స్ త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తారల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో మహేష్ బాబు పక్కనే ఎంతో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా ?.. హీరోయిన్ అనుకుంటే మాత్రం పొరపాటే. ఆ అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరో సతీమణి. ఇంతకీ ఎవరంటే.. మహేష్ బాబు పక్కనే కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరంటే మహేష్ బాబు చెల్లెలు సూపర్ స్టా్ర్ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు సతీమణి. ప్రస్తుతం మహేష్, ప్రియదర్శిని చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.

సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు నలుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల ఘట్టమనేని, ప్రియదర్శిని ఘట్టమనేని. పెద్దబ్బాయి రమేష్ బాబు హీరోగా వెండితెరపై అలరించారు. కొన్నాళ్ల క్రితమే అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా దూసుకుపోతున్నారు మహేష్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే కూతురు మంజుల ఘట్టమనేని సినిమాల్లో కీలకపాత్రలలో నటించింది. ఇక చిన్న కూతురు ప్రియదర్శిని సినిమాలకు దూరంగా ఉంటారు. 2006లో హీరో సుధీర్ బాబు, ప్రియదర్శినీల వివాహం జరిగింది. వీరికి ఇద్దరి కుమారులు. 2012లో శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుధీర్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ రాజమౌళీ రూపొందిస్తున్న ఈమూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఓవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు మహేష్. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

View this post on Instagram

A post shared by @urstrulymbfans

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles