Megha Akash: పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. అసలు విషయం ఇదన్నమాట..

త్వరలోనే మిల్కీబ్యూటీ తమన్నా, అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నిన్నటి నుంచి మరో హీరోయిన్ పెళ్లి వార్తలు నెట్టింట వైరలయ్యాయి. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అందాల తార మేఘా ఆకాష్. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ముఖ్యంగా అబ్బాయిల మనసులు దోచిన హీరోయిన్. అయితే ఈ భామ పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. అందుకు కారణం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలే.

Megha Akash: పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. అసలు విషయం ఇదన్నమాట..
Megha Akash
Follow us

|

Updated on: Apr 27, 2024 | 10:53 AM

చిత్రపరిశ్రమలో ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టూ టాలీవుడ్ సినీతారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలోని స్టార్స్ అంతా తాము కోరుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇటీవలే మలయాళీ కుట్టి అపర్ణదాస్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలోనే మిల్కీబ్యూటీ తమన్నా, అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నిన్నటి నుంచి మరో హీరోయిన్ పెళ్లి వార్తలు నెట్టింట వైరలయ్యాయి. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అందాల తార మేఘా ఆకాష్. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ముఖ్యంగా అబ్బాయిల మనసులు దోచిన హీరోయిన్. అయితే ఈ భామ పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. అందుకు కారణం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలే.

పట్టుచీరలో.. చేతులకు మెహందీ పెట్టుకుని.. మెడలో బంగారు ఆభరణాలు అలంకరించుకున్న ఫోటోస్ షేర్ చేసింది మేఘా ఆకాశ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అచ్చం పెళ్లి కూతురిలా కనిపించింది. దీంతో ఈ భామ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందంటూ నెట్టింట ప్రచారం నడిచింది. అంతేకాకుండా ఆమె షేర్ చేసిన ఫోటోలకు #WeddingVibes అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం నడుస్తుంది. అయితే తాజాగా తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది మేఘా.

పట్టుచీరలో సంప్రదాయ పద్దతిలో మేఘా ఆకాష్ కనిపించడానికి ఓ కారణం ఉంది. మేఘా అచ్చం పెళ్లి కూతురిలా కనిపించడానికి కారణం ఆమె బంధువుల పెళ్లి కావడమే. తన కుటుంబసభ్యులతో కలిసి సన్నిహితురాలి పెళ్లి వేడుకలో చాలా సరదాగా గడిపింది మేఘా. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది మేఘా.

నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మేఘా ఆకాష్. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమదేశం, రాజ రాజ చోర, గుర్తుందా శీతాకాలం, రావణాసుర, మనుచరిత్ర వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. అందం, నటనతో మెప్పించినా ఈ బ్యూటీకి ఆశించినంతగా అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.