AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Sukumar: వాళ్లిద్దరే నా బలం.. బలగం.. ఎన్నడూ నన్ను వీడలేదు.. సుకుమార్ ఎమోషనల్..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ హీరో సుహాస్ నటించిన ప్రసన్న వదనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ దాదాపు 15 సంవత్సరాలుగా సుకుమార్ వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఈ వేడుకలో తన శిష్యుడు అర్జున్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు సుకుమార్.

Director Sukumar: వాళ్లిద్దరే నా బలం.. బలగం.. ఎన్నడూ నన్ను వీడలేదు.. సుకుమార్ ఎమోషనల్..
Sukumar Director
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2024 | 11:21 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో చలనచిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు సుకుమార్. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి టాప్ సక్సెస్ డైరెక్టర్‏గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్య, ఆర్య 2, 100 % లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి హిట్ చిత్రాలను రూపొందించారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అటు బన్నీ, ఇటు సుకుమార్ కెరీర్ లోనే అత్యంత భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి రాబోతున్న సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ హీరో సుహాస్ నటించిన ప్రసన్న వదనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ దాదాపు 15 సంవత్సరాలుగా సుకుమార్ వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఈ వేడుకలో తన శిష్యుడు అర్జున్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు సుకుమార్.

సుకుమార్ మాట్లాడుతూ.. “జగడం సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో అర్జున్ నా దగ్గరికి వచ్చాడు. ఆర్య సినిమా బాగా నచ్చిందని.. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ కావాలని ఉందని అన్నాడు. అప్పుడు చాలా బక్కగా..చిన్న పిల్లాలడిలా ఉండేవాడు. జగడం సినిమా నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నా దగ్గర వర్క్ చేస్తున్న డైరెక్షన్ డిపార్మెంట్ మొత్తం వెళ్లిపోయారు. అర్జున్, తోట శ్రీను తప్ప. వీళ్లద్దరూ నాతోనే ఉన్నారు. ఇద్దరితో కూర్చుని కేవలం 23 రోజుల్లో 100 %లవ్ సినిమాను రాశాను. అప్పట్నుంచి వాళ్లతో కలిసి కథలు రాస్తున్నాను. నాకు ఆ ఇద్దరే బలం. నా అన్ని సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత చాలా మంది వచ్చి జాయిన్ అయ్యి వెళ్లేవాళ్లు. కానీ అర్జున్, తోట శ్రీను మాత్రం నా దగ్గరే ఉన్నారు. అర్జున్ చాలా నిజాయితిగా ఉంటాడు. అమాయకుడు. నా అర్జున్ ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు. నావల్ల వాడికి ఎంత మంచి జరిగిందో నాకు తెలియదు.. కానీ అతడి వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. లవ్ యు అర్జున్. నా అర్జున్ కు సపోర్ట్ చేయండి. థియేటర్ కు వచ్చి ప్రసన్న వదనం సినిమా చూడండి” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నారు.

డైరెక్టర్ అర్జున్ దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రసన్న వదనం సినిమాలో కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో పాయల్ రాధకృష్ణ,రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుంది. ఈ సినిమాలో నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీలకపాత్రలు పోషించగా.. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.