ఎంత పని చేశావన్నా..! అర్జున్ రెడ్డి సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ బ్రో..
విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా ఏది అంటే చిన్న పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్, ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా ఏది అంటే చిన్న పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్, ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది. కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ క్రేజ్ మొత్తం మారిపోయింది.. ఇప్పుడు విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే విజయ్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమాను ఓ క్రేజీ హీరో రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..? సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను ఏ రేంజ్ లో తీసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే అర్జున్ రెడ్డి లాంటి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ మంచు మనోజ్. ఈ యంగ్ హీరో ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
మంచు మనోజ్ చాలా కాలం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మనోజ్‌తోపాటు రోహిత్ , బెల్లంకొండా సాయి శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా మే 30న విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి, రామ్ చరణ్ రచ్చ, నాగ చైతన్య ఆటో నగర్ సూర్య లాంటి సినిమాలను మిస్ చేసుకున్నా అని తెలిపారు. అప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక, వేరే పరిస్థితుల కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయా అని చెప్పాడు మనోజ్. అర్జున్ రెడ్డి సినిమా మనోజ్ చేసి ఉంటే ఇప్పుడు మనోజ్ రేంజ్ మరో లెవల్ లో ఉండేది అని నెటిజన్స్ కామెట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







